వరుస వివాదాల్లో జొమాటో.. ఫుడ్ ఆర్డర్ కి ఇది సేఫెనా..!!

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఈమధ్య వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. మంచి మంచి ఆఫర్ లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న జొమాటో అందరి భోజన ప్రియుళ్ళకి మొదటి ఆప్షన్.. కాంపిటీషన్ లో ఎన్ని ఉన్నా అందరి మొబైల్స్ లో ఫుడ్ ఆర్డర్ అంటే జొమాటో వైపుకే వెళ్తుంది.. అంతలా ప్రజల్లో మమేకమైపోతుంది జొమాటో.. ఇక ఫెస్టివల్, స్పెషల్ అకేషన్ ఉన్న సమయంలో జొమాటో కి ఆర్డర్ల పండగ ఉంటుందని చెప్పొచ్చు. ఊపిరి సడలని బిజీగా జొమాటో డెలివరీల పని ఉంటుంది..

అలాంటి జొమాటో సంస్థ ఇంకా ఇంకా ఎదగాలంటే కస్టమర్లతో కలగొలుపుగా ఉండాలి.. ప్రజలకు అందించే వారి సేవను బట్టే సంస్థ పై ఉండే అభిప్రాయం మారుతుంది. కస్టమర్ లు ఏమన్నా ఆ సంస్థ లో పనిచేసేవారు ఓపికతో విని వారికితగ్గట్లుగా పనిచేయాలి కానీ వారి ఇష్టం వచ్చినట్లు చేస్తే సంస్థకే చెడ్డ పేరు.. అలంటి సంఘటన తాజగా జొమాటో డెలివర్ బాయ్ కి వెళ్ళాడు.. ఒక లేడీ నార్మల్ గా ఫుడ్ ఆర్డర్ చేసింది.. డెలివరీ బాయ్ తెచ్చాడు. అయితే ఎందుకు గొడవ అయ్యిందో తెలీదు కానీ ఇద్దరి మధ్య వాగ్వాదం.. రక్తాలు వచ్చేలా కొట్లాటలు.. జరిగాయి.. చివరికి జొమాటో కి బ్యాడ్ నేమ్ వచ్చింది.

ఈ విషయంలో అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. మార్చి 9 న బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ హితేషా చంద్రానీ ఫుడ్ ఆర్డర్ చేసింది. మధ్యాహ్నం 3.30 కి ఆర్డర్ చేయగా 4.30 ఫుడ్ ఆర్డర్ డెలివరీ కావాల్సింది కాలేదు. దాంతో టైం కు ఫుడ్ రాలేదు.. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవాలని కస్టమర్ కేర్ కి కాల్ చేసి చెప్పింది. అయితే ఆమె అలా ఫిర్యాదు చేసిందో లేదో ఫుడ్ డెలివరీ తో బాయ్ వచ్చాడు. దాంతో అతడిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. కామరాజ్ ని నిలదీసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. ఆ తర్వాత తన ఆర్డర్ కూడా తీసుకుని తాను పారిపోయాడని ఆమె చెప్పింది. ఈ వార్త క్షణాల్లో వైరల్ అయింది. దీన్ని బట్టి జొమాటో లో ఆర్డర్ చేయడం సేఫెనా అని ఆలోచిస్తున్నారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.