

ఏప్రిల్ 2 న నాగార్జున వైల్డ్ డాగ్ రాబోతుంది.. ఏప్రిల్ 9 న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా రాబోతుంది. ఏప్రిల్ 16 న శేఖర్ కమ్ముల , నాగ చైతన్య ల లవ్ స్టోరీ రాబోతుంది.. ఇక ఇదే నెలలో 23 వ తేదీన నాని టక్ జగదీష్ రాబోతుంది.. చూడబోతే ఈ ఏప్రిల్ మూవీ లవర్స్ కి పండగలా కనిపిస్తుంది. టాలీవుడ్ లో ఏప్రిల్ లో సినిమా పండగ మొదలవబోతుంది అని రిలీజ్ అయ్యే సినిమాలని బట్టి తెలుస్తుంది.. ఇప్పటికే సినిమాల మీద సినిమాలు రిలీజ్ అవుతూ టాలీవుడ్ లో పోయిన కళ తిరిగి వచ్చింది.. ఈ ఏప్రిల్ లో ఆ కళ ఇంకా డబల్ కాబోతుంది.


క్రాక్ సినిమా టాలీవుడ్ లో సినిమాల రిలీజ్ లకు ఊపిరినిస్తే ఉప్పెన, జాతిరత్నాలు కొత్త గాలులు వీచేలా చేసింది. ఇక ఈ ఏప్రిల్ లో అన్ని పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతుండడంతో ప్రేక్షకులు వాటిని చూడడానికి ఎంతో ఖుషి గా రెడీ అవుతున్నారు..వైల్డ్ డాగ్ సినిమా 2 న రాబోతుంది. నాగార్జున ఎన్నో హోప్స్ తో చేస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.. ఇక కార్తీ సుల్తాన్ కూడా అదే రోజున రాబోతుంది. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మొదటి సారి తమిళంలో నటిస్తుండగా ఈ సినిమా పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.


ఇక ఏప్రిల్ 9 వతేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు.. ఆ సినిమా కోసం అందరు ఎదురు చూస్తున్నారు.. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా, అందునా చాలా రోజుల తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయినా అప్ డేట్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి.. లవ్ స్టోరీ, నాని , శివ నిర్వాణం కాంబోలో ని టక్ జగదీష్ , రానా విరాటపర్వం ఇంకా మరిన్ని సినిమాలు ఏప్రిల్ లో రాబోతున్న సినిమాలు.. మరి ఈ సినిమాలలో ఏవి ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తాయి చూడాలి.