

దీపికా పిల్లి .. ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదూ.. టిక్ టాక్ ఉన్న రోజుల్లో దీపికా పిల్లి తన వీడియో లతో ఎంతో అలరించింది. దాంతో ఆమెకు ఫాలోయర్స్ అమాంతం పెరిగిపోయారు.. మిలియన్స్ లో ఆమెకు ఫాన్స్ ఉన్నారంటే నమ్మాల్సిన విషయమే.. అయితే టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గ ఉన్న దీపికా సడన్ గా ఢీ షో లో కనిపించి తన ఫాన్స్ కి షాక్ ఇచ్చింది.. అందులో ఆమె యాంకర్ అనే సరికి వారి ఆనందాలకు అవుథులు లేకుండా పోయాయి.

ఢీ షో లో ప్రస్తుతం రష్మీ కన్నా ఎక్కువగా ఆమెను చూడడానికే ఆసక్తి చూపుతున్నారట.. వర్షిణి ప్లేస్ లో ఢీ లోకి వచ్చిన దీపికా లేత అందాలకు ప్రేక్షకులు దాసోహం అవుతున్నారు. పక్కన రష్మీ ఉన్నా కూడా ఆమెను పట్టించుకోవట్లేదు ఫ్రెష్ గా కనిపించేసరికి రష్మీ ని మించిపోయే విధంగా ఆమెను ఫాలో అవుతున్నారు.. ఇక డ్రెస్ ల విషయంలో కూడా ఎంతో పొదుపు చేస్తుంది దీపికా.. నిండా పాతికేళ్ళు లేని దీపికా ఇలాంటి బట్టలేసి ప్రేక్షకులను కవ్విస్తుంది..
తాజగా సారంగా దరియా పాటకు దీపికా పిల్లి ఇలా డ్యాన్స్ చేసి తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.ఆ పాటకు ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేసినప్పటికీ.. నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. దానికి కారణం ఆమె డాన్స్ చేసింది గుడిలో.ఇలాంటి పాటకు గుడిలో డ్యాన్స్ చేయడం ఏంటని కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే చాలామంది నెటిజన్లు మాత్రం దీపికా డ్యాన్స్‌ను మెచ్చుకుంటున్నారు. సాయిపల్లవి కంటే అద్భుతంగా చేసిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. సూపర్ డ్యాన్సింగ్ అంటు కామెంట్లు పెడుతున్నారు.దీపికా ప్రస్తుతం ఓ టీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ షోకు యాంకర్ గా చేస్తుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘లవ్‌స్టోరీ’ సినిమా నుంచి సారంగదారియా అనే పాట విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. చాలామంది ఈ పాటకు తమదైన స్లైల్లో స్టెప్పులేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.