
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. తన కెరీర్ లోచాలా మంచి రోల్స్ చేసిన పవన్ కళ్యాణ్ తొలిసారి లాయర్ గా కనిపించి అదరగొట్టాడు. లాక్ డౌన్ తర్వాత రిలీజ్ అయిన పెద్ద సినిమా వకీల్ సాబ్ కావడంతో ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అని ఇండస్ట్రీ పెద్ద లు సైతం దీనిపై ఓ కన్నేసి ఉంచారు.. మొత్తానికి ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అవడంతో పాటు అదే రేంజ్ లో కూడా హిట్ అయ్యింది.. బాలీవుడ్ పింక్ సినిమా ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా లో అంజలి, నివేద థామస్, అనన్య నాగళ్ళ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రాగా , ఈ సినిమా కి దిల్ రాజు, బోణీ కపూర్ లు నిర్మాతలు.. ఎస్ ఎస్ తమన్ సంగీతం సమకూర్చారు.. ట్రైలర్ తోనే భీబత్సం సృష్టించిన సినిమా వకీల్ సాబ్ సినిమా తో ఆల్ టైమ్ రికార్డులన్నింటినీ భారీ తేడాతో బద్దలు కొట్టేసింది. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత చేస్తున్న సినిమా ఇది కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా కి ఉన్న డిమాండ్ కారణంగా దాదాపు అన్ని థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాగా ప్రతి సెంటర్ నుంచి సినిమా సూపర్ హిట్ అని టాక్ వచ్చింది.
ఈ సినిమా దర్శకుడు అయినా వేణు శ్రీ రామ్ కి ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడని వార్తలు ఈ మధ్య చక్కర్లు కొడుతుంది.. ఈ నేపథ్యంలో ఆయన సన్నిహితులు ఇందులో ఎలాంటి నిజం లేదని చెప్పారు..పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా కరుణ పాజిటివ్ రావడం వల్ల అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.. అసలు చిత్ర యూనిట్ సభ్యులను ఎవరిని కలిసి మాట్లాడే సమయం కూడా దొరకలేదు ఆయనకు.. ఆయన బాధలో ఆయన ఉంటే ఇలా ఫ్లాట్ గిఫ్టుగా ఇచ్చినట్లు వార్తలు రావడం బాధాకరం అన్నారు.