విశాల్, ఆర్య సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

తమిళ స్టార్ హీరోలు విశాల్, ఆర్యలు కలిసి ఒక చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘నోటా’ ఫేమ్ ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నోటా సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోయినప్పటికీ ఆనంద్ శంకర్ విశాల్, ఆర్యలను మరో సినిమా కోసం ఒప్పించాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలవ్వగా మొదటి షెడ్యూల్ పూర్తయినట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. కొద్ది రోజులు షూటింగ్ జరిగిన తర్వాత మొదటి షెడ్యూల్ పూర్తయినట్లు విశాల్ తెలియజేసాడు. "ఆర్య32, విశాల్ 30 చిత్ర మొదటి షెడ్యూల్ పూర్తయిందని తెలియజేయడానికి ఆనందిస్తున్నాను" అని విశాల్ ట్వీట్ చేసాడు. గద్దలకొండ గణేష్ ఫేమ్ మృణాళిని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎస్.ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే మొదలవుతుందని టీమ్ తెలియజేస్తోంది. ఆర్య, విశాల్ లు గతంలో వాడు వీడు సినిమా కోసం కలిసి నటించారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వారు కలిసి నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం పై భారి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరో వైపు విశాల్ నటిస్తోన్న ‘చక్ర’ కూడా విడుదలకు సన్నద్ధమవుతోంది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.