వరస బ్లాక్ బస్టర్ హిట్స్ తో తన రేంజ్ ని అలాగే తెలుగు పరిశ్రమ రేంజ్ ని కూడా పెంచుకుంటూ పోతున్న ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ అని అందరికీ తెలిసిన విషయమే. రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులు గా నటిస్తున్న ఈ చిత్రం లాక్డౌన్ తర్వాత శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అలాగే ఆర్.ఆర్.ఆర్ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వీడియోను సోషల్ మీడియా లో పంచుకున్నారు. ఈ వీడియోలో ఒక భారీ యాక్షన్ సీన్ మేకింగ్ జరుగుతున్నట్టు ఈ సన్నివేశం థియేటర్లలో వేరే లెవెల్లో ఉంటుందని చెప్పారు. చారిత్రక పాత్రలకు ఫిక్షనల్ స్టోరీ జోడించి రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, ఆయనకు జోడీగా అలియా భట్ నటిస్తోంది. ఇక కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తుండగా ఆయనకు జోడీగా హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్ నటిస్తుంది. ఇందులో ఇంకా కొంతమంది హాలీవుడ్ నటులు అలాగే బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నారు. రాజమౌళి అన్ని సినిమాలకి పని చేసే ఎం.ఎం కీరవాణి గారే ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని భారీ వ్యయంతో డి.వి.వి దానయ్య గారు నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే విడుదల చేసిన టీజర్స్ కి భారీ స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా విడుదల తర్వాత ఇంకెన్ని సంచాలనలని సృష్టిస్తుందో వేచి చూడాలి.
Anddd... Leaving it to your imagination now 😉🔥🌊 #RRRDiaries #RRRMovie #RRR pic.twitter.com/gm1KHmKSpM
— RRR Movie (@RRRMovie) November 7, 2020