విరాటపర్వానికి వ్యతిరేక పవనాలు

రానా దగ్గుబాటి, సాయి పల్లవి, ప్రియమణి, తదితరులు నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. నక్సల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకుడు. ఆయన తెరకెక్కించిన మొదటి చిత్రం ‘నీది నాది ఒకే కథ’. కొత్తదానంతో ఉండే ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకోవడంతో పాటు ఎంతోమంది యువ కథకులకు స్పూర్తిగా నిలిచింది. ఇక ఆయన నుండి వస్తున్న రెండవ చిత్రమైన విరాటపర్వం విడుదలకు ముందే భారి అంచనాలను నెలకొల్పింది. ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్, మోషన్ పోస్టర్స్, అన్ని విశేష స్పందనను తెచ్చుకున్నాయి.

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. అసలు జనాలు నక్సలైట్లు గా ఎందుకు మారతారు, ఆదివాసీలు పై ప్రభుత్వాలు, జవాన్లు చేసే అకృత్యాలు ఇలాంటి పరిస్థితుల నడుమ ఒక నక్సలైట్ యొక్క భావజాలం పట్ల ఆకర్షితురాలైన అమ్మాయి ఇలాంటి ఇతివృత్తంతో ఈ చిత్రం సాగుతుందని సమాచారం. ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ చిత్రంపై మంచి అభిప్రాయం ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ చిత్రంపై వ్యతిరేక పవనాలు ఆజ్యం పోసుకుంటున్నాయి.

కొంతమంది సో కాల్డ్ దేశభక్తులు ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ ట్విటర్ వేదికగా తమ అతివాదాన్ని ప్రదర్శిస్తున్నారు. #banvirataparvam ఇప్పుడు ట్విటర్ లో ట్రెండ్ అవుతోంది. నక్సలైట్లను, మావోయిస్ట్లను హీరోలుగా చూపిస్తున్నారని, ఎంతోమంది వీర జవాన్లు నక్సల్స్ చేతిలో మరణించారు, నక్సల్స్ నిజ జీవితాల్ని వాళ్ళ వెనుక ఉండే చీకటి ప్రపంచాన్ని ఎందుకు చూపించరు అని ట్విటర్ వేదికగా నిప్పులు చెరుగుతున్నారు. అయితే దీని పై కొందరు సానుకూలంగా స్పందిస్తుంటే కొందరు మాత్రం విరాటపర్వం సినిమాకి మద్దతు తెలుపుతున్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.