అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషనల్ పాయింట్‌తో ‘విమానం’ సినిమా తెరకెక్కింది: ద‌ర్శ‌కేంద్రుడ కె.రాఘ‌వేంద్ర‌రావు జూన్ 9న తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ అవుతున్న ‘విమానం’

‘చిన్న‌ప్పుడు పిల్ల‌ల్లో ఓ మంచి ఎమోష‌న్‌ను నింపితే వాళ్లు పెద్దై ఏదైనా సాధించ‌గ‌ల‌రు అని చెప్ప‌టానికి ‘విమానం’ సినిమా ఒక ఉదాహ‌ర‌ణ‌’’ అని అన్నారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. తండ్రీ కొడుకులు మ‌ధ్య భావోద్వేగం, లవ్ వంటి ఎమోష‌న్స్ కల‌యిక‌గా రూపొందిన చిత్రం ‘విమానం’. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌) ఈ చిత్రాన్ని నిర్మించారు. రీసెంట్‌గా ప్ర‌ముఖ హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ చేతుల మీదుగా విడుద‌లైన మూవీ ట్రైల‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ‘విమానం’ మూవీ ట్రైల‌ర్‌ను వీక్షించిన సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కె.రాఘవేంద్ర‌రావు మాట్లాడుతూ ...

‘‘విమానం’ సినిమా ట్రైల‌ర్ చూశాను. ట్రైల‌ర్ చాలా బాగా వ‌చ్చింది. చాలా మంచి ఎమోష‌న్స్‌తో సినిమా ఉంటుంద‌ని తెలిసింది. అలాగే ద‌ర్శ‌కుడు శివ ప్ర‌సాద్ తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉండే ఎమోష‌న్ గురించి చెబుతుంటే బాగా ట‌చింగ్‌గా అనిపించింది. క‌ళ్ల‌లో నీళ్లు వ‌చ్చాయి. ఇలాంటి డిఫ‌రెంట్ కంటెంట్ సినిమాల‌ను ప్రొడ్యూస‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్ ఎంక‌రేజ్ చేయాలి. త‌ల్లిదండ్రులు ‘విమానం’ సినిమాను చూడటమే కాకుండా.. వాళ్ల పిల్లలకు కూడా సినిమాను చూపించాలి. అప్పుడే ఇందులో పిల్లల కోసం తల్లిదండ్రులు పడే తపన ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. అలాగే సినిమాలో మిగిలిన క్యారెక్టర్స్ ఎంతో అద్భుతంగా పండాయి. ఇలాంటి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న ద‌ర్శ‌కుడు శివ ప్ర‌సాద్‌, నిర్మాత కిర‌ణ్ గారికి అభినంద‌న‌లు. ఎంటైర్ టీమ్‌కు కంగ్రాట్స్‌. జీ స్టూడియోస్‌కు ఆల్ ది బెస్ట్‌. ఇలాంటి మంచి సినిమాల‌ను రూపొందిస్తోన్న జీ స్టూడియోస్ ప్రసాద్‌ని ఈ సంద‌ర్బంగా అభినందిస్తున్నాను.

అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే ఎమోష‌న‌ల్ పాయింట్‌తో ‘విమానం’ సినిమాను తెరకెక్కించారు. ఈ ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత నాకొక విష‌యం గుర్తుకు వ‌చ్చింది. అదేంటంటే ‘జీఎంఆర్ సంస్థ‌ల అధినేత మ‌ల్లిఖార్జున‌రావుగారికి పెళ్లైంది. ఆయ‌న ద‌గ్గ‌ర ఓ వెస్పా ఉండేది. వాళ్లావిడ ఓసారి విమానాన్ని చూపించ‌మ‌ని అడిగితే ఆమెను ఆయ‌న త‌న వెస్పాలో ఆమెను రాజం నుంచి వైజాగ్ తీసుకెళ్లారు.  గోడ మీద నుంచి దూరంగా ఉన్న విమానాన్ని చూపించారు. అలాంటి జీఏంఆర్‌గారు ఇవాళ గొప్ప గొప్ప ఎయిర్ పోర్ట్స్ క‌ట్టారు’. అలా చాలా మంది జీవితాల్లో ఇలాంటి ఎమోషనల్ పాయింట్ ఉంటుంది. దాన్ని ఈ సినిమాలో హార్ట్ టచింగ్‌గా చూపించారు.  స‌ముద్ర‌ఖ‌ని, అన‌సూయ‌, ధ‌న‌రాజ్, రాహుల్ రామ‌కృష్ణ స‌హా అంద‌రూ గొప్ప‌గా పెర్ఫామ్ చేశారు. మ్యూజిక్‌,  బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బావుంది. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్‌’’ అన్నారు.

‘విమానం’ చిత్రంలో వీర‌య్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్ర‌లో స‌ముద్ర ఖ‌ని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ న‌టిస్తుండగా సుమ‌తి పాత్ర‌లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, రాజేంద్ర‌న్ పాత్ర‌లో రాజేంద్ర‌న్‌, డేనియ‌ల్ పాత్ర‌లో ధ‌న్‌రాజ్‌, కోటి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మెప్పించబోతున్నారు. ప్ర‌ముఖ నటి మీరా జాస్మిన్ అతిథి పాత్ర‌లో న‌టించారు. జూన్ 9న ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ అవుతుంది.


న‌టీన‌టులు:  
స‌ముద్ర ఖ‌ని, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్‌, రాజేంద్ర‌న్

సాంకేతిక వ‌ర్గం:

ప్రొడ్యూస‌ర్స్‌:  జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌)
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  శివ ప్ర‌సాద్ యానాల‌
సినిమాటోగ్ర‌పీ:  వివేక్ కాలేపు
ఎడిట‌ర్‌:  మార్తాండ్ కె.వెంక‌టేష్‌
మ్యూజిక్‌:  చ‌ర‌ణ్ అర్జున్‌
ఆర్ట్‌:  జె.జె.మూర్తి
డైలాగ్స్‌:  హ‌ను రావూరి (తెలుగు), ప్ర‌భాక‌ర్ (త‌మిళం)
లిరిక్స్ :  స్నేహ‌న్‌(తమిళ్), చరణ్ అర్జున్ (తెలుగు)
పి.ఆర్‌.ఒ:  నాయుడు - ఫ‌ణి (బియాండ్ మీడియా) (తెలుగు), యువ‌రాజ్ (త‌మిళ్‌)
డిజిట‌ల్ ఏజెన్సీ: హ్యాష్ ట్యాగ్ మీడియా

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.