రేడియో మాధవ్ గా రాబోతున్న విజయ్ సేతుపతి

ప్రస్తుతం ఓ.టి.టి ప్లాట్ ఫామ్స్ ఎక్కువయ్యే కొద్దీ ఇతర భాషల్లోని సినిమాలు తెలుగులోకి అనువాదం చేయబడుతున్నాయి. ఇప్పుడు ఈ వరసలోకి విజయ్ సేతుపతి సినిమా కూడా రాబోతుంది. విజయ్ సేతుపతి, జయరామ్ హీరోలుగా నటించిన మలయాళ సినిమా ‘మార్కొని మతాయ్’  ఇప్పుడు ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘రేడియో మాధవ్’ పేరుతో  తీసుకొస్తున్నారు .  ఈరోజు ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా మంచి ఎంటర్టైనర్ లాగా కనిపిస్తుంది. ఈ రేడియో విజయ్ సినిమాని లక్ష్మీ చెన్నకేశవ ఫిలిమ్స్ అధినేత, నిర్మాత కృష్ణస్వామి తెలుగు లో విడుదల చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మలయాళంలో మంచి విజయం సాధించింది.  తమిళంలో నటుడిగా చాలా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి మలయాళంలో నటించిన తొలి చిత్రమిది.  ఈ సినిమా తెలుగు వెర్షన్ ఫస్ట్ లుక్‌ను బుధవారం హీరో శ్రీవిష్ణు విడుదల చేశారు. ‘‘విజయ్ సేతుపతి గారు నటించిన ‘రేడియో మాధవ్’ తెలుగులో అనువాదం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దర్శకనిర్మాతలకు ఆల్ ది బెస్ట్. ’’ అని శ్రీవిష్ణు అన్నారు. తెలుగులో మెల్లగా తన మార్కెట్ పెంచుకుంటున్న విజయ్ సేతుపతి ఈ సినిమాతో ఇంకెంతమంది అభిమానులని సంపదిస్తారో చూడాలి. ఈ సినిమాలో కథానాయికలుగా పూర్ణ, ఆత్మీయ రాజన్ నటిస్తున్నారు. ఈ సినిమాకి మలయాళ సంగీత దర్శకుడు జయరాజన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించబోతున్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.