
విజయ్ సేతుపతి గురించి తెలియని వారు ఉండరు. మక్కల్ సెల్వన్ గా తమిళ ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారు. తన నటనతో కేవలం తమిళ ప్రేక్షకుల్లోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే స్వభావం కలిగిన విజయ్ సేతుపతి అవసరాల్లో ఉన్న ఎందరో అభిమానులకు సహాయ పడ్డారు. ఇప్పుడు కూడా తన పెద్ద మనసును చాటుకున్నారు మన మక్కల్ సెల్వన్.
Actor @VijaySethuOffl today contributed a sum of Rs 25 Lakhs to the Tamil Nadu Chief Minister's Relief fund. The actor met Honourable TN Chief Minister @mkstalin at the Secretariat and presented a cheque for the amount.@proyuvraaj pic.twitter.com/HflN3IAs1C
— BARaju's Team (@baraju_SuperHit) June 15, 2021
కరోన కారణంగా జరిగిన నష్టం మామూలుది కాదు. ఎందరో తమ ప్రాణాలను కోల్పోయారు, మరెందరో అయిన వాళ్ళను కోల్పోయారు. కరోన వల్ల మన ఎకానమీ కూడా చాలా వరకు దెబ్బతింది. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఎం చేయలేని పరిస్థితి ఎదురయింది. ఇలాంటి సమయాల్లో పలువురు ముందుకు వచ్చి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. గత ఏడాది సోనూ సూద్ చేసిన గొప్ప పనిని దృష్టిలో ఉంచుకుని ఎంతోమంది సెలబ్రిటీలు తమకు చేతనైన సహాయాన్ని చేసేందుకు ముందుకు వస్తున్నారు.

రీసెంట్ గా గవర్నమెంట్ ఫార్మ్ చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిసి తమిళ స్టార్ హీరోలు, సెలబ్రిటీలు తమ విరాళాల్ని అందజేసిన విషయం తెలిసిందే. అలగే విజయ్ సేతుపతి 25 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఆయన మంగళవారం స్టాలిన్ గారిని కలిసి చెక్ ను అందజేశారు. ఇటీవలే ఆయన తమిళ జూనియర్ ఆర్టిస్ట్‌లకు సహాయం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేతిలో 14 సినిమాలు ఉన్నాయి. వాటి కోసం ఆయన అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తున్నారు.