
నారప్ప , F3 , దృశ్యం 2 లతో బిజీ గా ఉన్నాడు ఫ్యామిలీ సినిమాల హీరో వెంకటేష్. వెంకటేష్ ప్రత్యేకత ఏంటి అంటే ఎక్కువ సక్సెస్ రేటు ఉన్న టాలీవుడ్ హీరో లలో ఆయన ఒకరు.. సక్సెస్ వచ్చిన్నపుడు పొంగిపోరు.. లేనప్పుడు కృంగిపోరు..మన మిగిలిన హీరోలతో పోలిస్తే ఎక్కువ విజయాలను అందుకున్న హీరో విక్టరీ వెంకటేష్ అని చెప్పాలి..

యావరేజ్ లెక్కల్లో ఏడాదికి రెండు సినిమాలు వంతున ఆయన కెరీర్ ఇప్పటివరకు తాపీగా సాగింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్ తన 75 మైలురాయికి చేరువ కాబోతున్నాడు. ఇదిలా ఉంటే వెంకటేష్ నటిస్తున్న దృశ్యం 2 సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. అది కూడా ఓటీటీ లో.. ఈ సినిమా కోసమే ఇప్పుడు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం కరోనా కారణంగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసే పరిస్థితి లేదు. అందువలన మలయాళ 'దృశ్యం 2' సినిమా మాదిరిగానే తెలుగులోను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. డీల్ ఓకే అయితే అమెజాన్ ప్రైమ్ నుంచి పలకరిస్తుందనీ, లేదంటే నేరుగా థియేటర్లకే వస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ రెండింటిలో ఏది జరుగుతుందో చూడాలి.