
నారప్ప , F3 , దృశ్యం 2 లతో బిజీ గా ఉన్న ఫ్యామిలీ సినిమాల హీరో వెంకటేష్ మూడున్నర దశాబ్దాలుగా ప్రేక్షలను అలరిస్తూనే ఉన్నాడు.. విక్టరీ బిరుదుని సాకారం చేసుకున్నారు వెంకటేష్. ఇదిలా ఉంటే నెమ్మదిగా గా సినిమాలు చేయడం మొదటి నుంచి వెంకటేష్ కి అలవాటు.. అయన కెరీర్ మొత్తం చూసుకుంటే ఏడాదికి మూడు నాలుగు సినిమాలు వచ్చిన సందర్భాలు చాలా అరుదు.

యావరేజ్ లెక్కల్లో ఏడాదికి రెండు సినిమాలు వంతున ఆయన కెరీర్ ఇప్పటివరకు తాపీగా సాగింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్ తన 75 మైలురాయికి చేరువ కాబోతున్నాడు. ఆయన ప్రస్తుతం చేస్తున్న దృశ్యం 2 74 మూవీ గా ఉంది. అంటే దీని తర్వాత చేయబోయే సినిమా ల్యాండ్ మార్క్ మూవీ అన్నమాట. ఇదిలా ఉండగా ఈ చిత్రం అనంతరం మరో క్రేజీ రీమేక్ లో వెంకటేష్ నటించనున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అది కూడా మళయాళ సూపర్ హిట్ చిత్రం “డ్రైవింగ్ లైసెన్స్” అన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి గత కొంత కాలంగా మన టాలీవుడ్ లో టాక్ ఉంది. కానీ ఫైనల్ గా ఈ చిత్రం వెంకీ మామ దగ్గరకు వెళ్లిందని గాసిప్స్ ఇపుడు వినిపిస్తున్నాయి. అలాగే ఈ చిత్రం పై అధికారిక ప్రకటన కూడా రావచ్చని ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కాలమే నిర్ణయించాలి.