
నారప్ప , F3 , దృశ్యం 2 లతో బిజీ గా ఉన్న ఫ్యామిలీ సినిమాల హీరో వెంకటేష్ మూడున్నర దశాబ్దాలుగా ప్రేక్షలను అలరిస్తూనే ఉన్నాడు.. ఇన్ని సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో విక్టరీ వెంకటేష్ ఎన్నో ఎత్తులు పల్లాలు చూశారు.అయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ లు ఉన్నాయి. బిగ్గెస్ట్ ఫ్లాప్ లు ఉన్నాయి.. వెంకటేష్ ప్రత్యేకత ఏంటి అంటే ఎక్కువ సక్సెస్ రేటు ఉన్న టాలీవుడ్ హీరో లలో ఆయన ఒకరు.. సక్సెస్ వచ్చిన్నపుడు పొంగిపోరు.. లేనప్పుడు కృంగిపోరు..మన మిగిలిన హీరోలతో పోలిస్తే ఎక్కువ విజయాలను అందుకున్న హీరో విక్టరీ వెంకటేష్ అని చెప్పాలి..

విక్టరీ బిరుదుని సాకారం చేసుకున్నారు వెంకటేష్. ఇదిలా ఉంటే నెమ్మదిగా గా సినిమాలు చేయడం మొదటి నుంచి వెంకటేష్ కి అలవాటు.. అయన కెరీర్ మొత్తం చూసుకుంటే ఏడాదికి మూడు నాలుగు సినిమాలు వచ్చిన సందర్భాలు చాలా అరుదు. యావరేజ్ లెక్కల్లో ఏడాదికి రెండు సినిమాలు వంతున ఆయన కెరీర్ ఇప్పటివరకు తాపీగా సాగింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్ తన 75 మైలురాయికి చేరువ కాబోతున్నాడు. ఆయన ప్రస్తుతం చేస్తున్న దృశ్యం 2 74 మూవీ గా ఉంది. అంటే దీని తర్వాత చేయబోయే సినిమా ల్యాండ్ మార్క్ మూవీ అన్నమాట.

దాంతో వెంకటేష్ ఈ మూవీ నీ ప్రెస్టేజ్ తీసుకున్నారని టాక్. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ లో తీయాలని కూడా భావిస్తున్నారట. ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ తీస్తుంది అంటున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ ఎవరు అన్న చర్చ వచ్చినప్పుడు మరో మాట లేకుండా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఓటు వేశారని అంటున్నారు. అంటే విక్టరీ వెంకటేష్ కెరీర్ లో సూపర్ హిట్ మూవీస్ ఇచ్చిన త్రివిక్రమ్ అయితేనే బ్లాక్ బస్టర్ హిట్ ఈ టైం లో అందుకోగలరని భావించి ఆయన్ని సెలక్ట్ చేశారని అంటున్నారు. వీరి కలయిక లో గతంలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సినిమాలు రాగా అవి సూపర్ హిట్ అయ్యాయి.. అయితే వీటికి త్రివిక్రమ్ రచయిత మాత్రమే..