
వరుస హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు హీరో వరుణ్ తేజ్.. అయన గత చిత్రం గద్దలకొండ గణేష్ చిత్రం సూపర్ హిట్ అవడంతో అయన ప్రస్తుతం నటిస్తున్న గని సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఈ సినిమా కి కిరణ్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది..

ఇక ఈ సినిమా పూర్తికాకముందే అయన తదుపరి చిత్రం పై ఊహాగానాలు మొదలవుతున్నాయి. తాజాగా వరుణ్ తేజ్ నుంచి వెంకీ కుడుములకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా చెబుతున్నారు. 'ఛలో' .. 'భీష్మ' సినిమాల భారీ విజయాలతో దర్శకుడిగా తానేమిటనేది వెంకీ కుడుముల నిరూపించుకున్నాడు.

ఆ తరువాత సినిమాను చరణ్ తో చేయాలనే ఉద్దేశంతో ఆయనకి కథను వినిపించాడు. ఈ కథ తనకంటే వరుణ్ తేజ్ కి బాగా సెట్ అవుతుందని చెప్పి, చరణ్ ఆయన దగ్గరికి పంపించాడట. అలా వరుణ్ తేజ్ దగ్గరికి వెళ్లిన ప్రాజెక్టు ఇప్పుడు సెట్ అయిందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని చెబుతున్నారు.