
టీవీ షో నిర్వాహకులు ఇటీవలే శృతిమించుతున్నారనిపిస్తుంది.. తమ షో ల రేటింగ్ ల కోసం, హిట్ అవడం కోసం ప్రేక్షకుల ఎమోషన్స్ ని వాడుకుంటున్నారు.. ఎమోషన్స్ అయితే పర్వాలేదు కానీ ఆ షో లో పాల్గొనే ఆర్టిస్ట్ ల ఎమోషన్స్ ని ప్రేమ పేరుతో వాడుకుంటున్నారు.. అయితే అది షో వరకే అని అందరికి తెలిసినా అది మితి మీరితే ఎలాంటి పరిస్థితులకు దారితీయిస్తుంది అన్నదే అసలు విషయం.. బుల్లితెరపై కొన్ని జంటలు అలరిస్తున్నాయి.. మొదటి నుంచి ఈ ఆనవాయితీ ని అనుసరిస్తూ వస్తున్నాయి టీవీ చానళ్ళు..

మొదట్లో వేణుమాధవ్, ఉదయభాను ఆ తర్వాత రవి లాస్య, సుధీర్ రష్మీ, అది అనసూయ , వర్షిణి ఆది, ఇప్పుడు వర్ష ఇమ్మాన్యుయెల్. ఇలా ఏ తరరానికి ఆ తరం యాంకర్ లను సెట్ చేస్తూ షో లను హిట్ చేస్తున్నారు.. అయితే ఈ మధ్య ఈ లింక్ అప్ అనేది కొంత శృతి మించుతున్నట్లు ఉంది.. సుధీర్ రష్మీ ల మధ్య ఏదీ లేకపోయినప్పటికీ వీరిద్దరి మధ్య ఎదో ఉందని ఇంకా ప్రేక్షకులను మభ్య పెట్టె పనిచేస్తన్నారు జబర్దస్త్ యాజమాన్యం.. ఇక లేటెస్ట్ గా తెరమీదకి వచ్చింది మరో జంట.. వారే వర్ష ఇమ్మాన్యుయెల్..

జబర్దస్త్ షో లో వీరి రొమాన్స్ చూస్తుంటే నిజంగానే వీరిద్దరూ లవ్ చేసుకుంటున్నారా అని అనుకుంటున్నారు ప్రేక్షకులు. ఒకానొక సందర్భంలో వీరిద్దరూ లైన్ క్రాస్ చేసేంత రొమాన్స్ లోకి దిగిపోయారు. షోలో వర్ష ఇమ్మాన్యుయెల్ ఇద్దరూ కలిసి మంచి కెమిస్ట్రీనే పండిస్తున్నారని, సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. బయట కూడా ఇదే కొనసాగుతుందని అంటున్నారు చాలామంది. అయితే ఈ వార్తలకి బలం చేకూరే విధంగా వర్ష మరోసారి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. ఈ మధ్య ఓ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వర్ష బిల్డింగ్ పై నుండి దూకింది అంటూ రాశారు. అది చూసి ఇమ్మాన్యుయెల్ నాకు అర్థ రాత్రి ఫోన్ చేసి.. వర్ష నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు. దానికి ఫిదా అయిపోయానని అప్పుడే వీడు నావాడిని నేను ఫిక్స్ అయ్యానని వర్ష రోజాతో అన్నారు. మరి ఇది షో కోసమే అన్నారా.. లేదా నిజంగానే అన్నారా అనేది తెలియాల్సి ఉంది.