
టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్ లు ఎన్నిరోజులు సినిమాలు చేసుకుంటూ పోయినా కూడా పాత అయ్యారు అనే భావం అనిపించదు. అలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్లలో శ్రీయ ఒకరు. 2000 సంవత్సరంలో ఇష్టం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన శ్రీయ ఆ తర్వాత వరుసగా హిట్ చిత్రాల్లో నటించి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ సినిమా వచ్చి దాదాపు 21 సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఆమె తన వన్నె తగ్గని అందంతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.

చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ , బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతోనే కాకుండా ప్రభాస్, రవితేజ,పవన్, మహేష్ వంటి యంగ్ హీరోలతో నటించిన కుర్ర హీరో సీనియర్ హీరో అనే తేడా లేకుండా అందరితో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను, అందరి హీరోల అభిమానులను అలరించింది. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఆమె నటించి అక్కడి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

సోషల్ మీడియా వేదికగా ఆమె పెట్టే పోస్టుల ద్వారా కూడా ప్రేక్షకులను చాలా బాగా అలరించారు శ్రియా. బెస్ట్ యాక్ట్రస్ గా ఎన్నో అవార్డులు అందుకున్న శ్రీయ తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ అర్అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ అలాంటి హీరోయిన్లలో ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఈమె కెరీర్ ఇంకా ఇలానే కొనసాగాలని ప్రేక్షకులను అలరించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.