
హెచ్. వినోద్ దర్శకత్వంలో తమిళ స్టార్ అజిత్ నటిస్తున్న కొత్త చిత్రం”వాలిమై”. బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్.ఎల్.పి. బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్యాంగ్స్ అఫ్ వస్సేపూర్, డి-డే, కాలా చిత్రాల్లో నటించిన హిందీ నటి హ్యూమా ఖురేషి ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. యువ తెలుగు నటుడు అర్.ఎక్స్ హండ్రెడ్, గుణ 369, 90 ML చిత్రాల హీరో కార్తికేయ గుమ్మకొండ ఇందులో ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తుండడం విశేషం. ఇది కార్తికేయాకి తమిళంలో మొట్టమొదటి సినిమా. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 2019 లో హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటిలో జరిగింది. సుమారు 20 రోజుల పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించారు. తరువాత కోవిడ్ లాక్ డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడింది. ఈ మధ్యనే చెన్నైలో తిరిగి చిత్రీకరణ ప్రారంభమైంది. మళ్ళీ కొత్త షెడ్యూల్ కోసం చిత్రబృందం హైదరబాద్ లో అడుగు పెట్టింది. అక్టోబర్ 25న ఈ షెడ్యూల్ మొదలవబోతుంది. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ మార్గ దర్శకాలతో సెట్స్ లో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ షెడ్యూల్ లో అజిత్, కార్తికేయ, హ్యూమా ఖురేషి మరియు ముఖ్య తారాగణం పై కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఛాయా గ్రహణం : నిరవ షా.