కొణిదెల కోడలు పిల్ల, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసాన కొణిదెల ఇన్స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేసింది. మాములుగా సోషల్ మీడియాలో సెలెబ్రేటీస్ తమ ఫోటోస్ ను, సినిమాలకు సంబంధించి అప్డేట్ పోస్టులు పెడుతుంటారు. కొంతమంది ఫిట్ నెస్ కి సంబంధించిన టిప్స్, డైట్ ప్లాన్, తదితర విషయాలు గురించి చెప్తారు. ఉపాసన కొణిదెల కూడా హెల్త్ అండ్ ఫిట్ నెస్ గురించి, రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి సినిమాల అప్ డేట్ గురించి పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. ఉపాసన కొణిదెల తాజాగా ఇన్స్టాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. urlife.co.in ఇన్స్టా పేజిని మెన్షన్ చేస్తూ, దేవీ సిరీస్, భరత నాట్యం, చేనేత కార్మికుల గురించి చెప్తూ విడియో పోస్ట్ చేసింది. ఈ విడియోలో యుఅర్ లైఫ్ వెబ్ సైట్ వాళ్ళు చేస్తున్న దేవి సిరిస్ గురించి మాట్లాడింది. ఈ సిరీస్ లో దేశం మొత్తంలో ఉన్న చేనేత కార్మికుల గురించి వాళ్ళు నేస్తున్న చీరలు, వాళ్ళ పనితనం, చేనేత కళ గురించి వివరించింది. ఈ విడియోలో మగ్గం నేస్తున్న చేనేత కార్మికుల ఫోటోలు, పట్టు చీరలో ఉన్న క్లాసికల్ డాన్సర్స్ ఫోటోలు ఉన్నాయి. దేవీ సిరీస్ గురించి, చేనేత వస్త్రాల గొప్పతనం, క్లాసికల్ డాన్స్ గురించి మాట్లాడుతూ వీడియో పోస్ట్ చేసింది. ఈ విషయాలు తన మనసుకు చాలా దగ్గరైన విషయాలు అని చెప్పుకొచ్చింది.