'ఝాన్సీ రాణి' అనే నేషనల్ సీరియల్ లో ఝాన్సీ కీ రాణి అనే పాత్రలో నటించి ఎంతో పేరు తెచ్చుకుంది ఉల్కా గుప్త. బీహార్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఉల్కా గుప్త ముంబైలో పుట్టి పెరిగింది. మన టాలీవుడ్ సినిమా లో కూడా నటించింది తను. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'రుద్రమదేవి' సినిమాలో అనుష్క శెట్టి 'రుద్రమదేవి' పాత్రను పోషించింది. యంగ్ 'రుద్రమదేవి' గా ఉల్కా గుప్త నటించింది. అంతేకాకుండా పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా నటించిన 'ఆంద్రా పోరి' చిత్రం లో మెయిన్ హీరోయిన్ గా నటించింది.
అయితే ఉల్కా గుప్త ఇప్పుడు... 'మేరా రంగ్ కాలా' అనే ఆల్బమ్ రిలీజ్ చేసింది.
డార్క్ స్కిన్ టోన్ ఉన్న అమ్మాయిలని ఎలా హేళనగా చూస్తున్నారు, ఎలా నిరాశకి గురి చేస్తున్నారు అనే అంశం మీద మంచి మెస్సేజ్ ని ర్యాప్ స్టైల్లో మిక్స్ చేసి...
'మేరా రంగ్ కాలా' అనే పాట ద్వారా తన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఇలాంటి మంచి పాటల్ని ఆదరించి మన సపోర్ట్ తెలిజేయాల్సిన అవసరం మన అందరి పైనా ఉంది. ఎందుకంటే ఇది ఎన్నో శతాబ్దాలుగా చాలా మంది నలుపు రంగుతో ఉన్న అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్య.