బెల్లంకొండ గణేష్, రాఖీ ఉప్పలపాటి, ‘నాంది’ సతీష్ వర్మ, ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘నేను స్టూడెంట్ సార్!’ కు యూ/ఏ సర్టిఫికెట్ - జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల!!

స్వాతిముత్యం’ సినిమా తో సక్సెస్ ఫుల్ గా అరంగేట్రం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సార్' తో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి రాఖీ ఉప్పలటి దర్శకత్వం వహించగా, ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌ పై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్ అంచనాలు పెంచాయి.

జూన్ 2న నేను స్టూడెంట్ సార్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి 'యూ/ఎ' సర్టిఫికేట్ ఇచ్చింది. ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలిగిందని సెన్సార్ బోర్డ్ సభ్యులు నేను స్టూడెంట్ సార్ టీం ని అభినందించారు. సినిమా మొదటి నుంచి చివరి వరకూ చాలా థ్రిల్లింగ్, గ్రిప్పింగ్ గా వుందని కితాబిచ్చారు.

ఈ చిత్రంలో గణేష్ కు జోడిగా అవంతిక దస్సాని నటిస్తున్నారు. సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కృష్ణ చైతన్య కథ అందించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. అనిత్ మాదాడి కెమెరామెన్ గా పని చేస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్, కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ అందిస్తున్నారు.

నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్, ప్రమోధిని, రవి శివతేజ తదితరులు.

సాంకేతిక విభాగం
దర్శకత్వం: రాఖీ ఉప్పలపాటి
నిర్మాత: ‘నాంది’ సతీష్ వర్మ
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: అనిత్ మధాడి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
కథ: కృష్ణ చైతన్య
డైలాగ్స్: కళ్యాణ్ చక్రవర్తి
కొరియోగ్రఫీ: రఘు మాస్టర్
ఫైట్స్: రామకృష్ణన్
పీఆర్వో  వంశీ-శేఖర్

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.