
రవితేజ సినిమాలు దాదాపు ఆరు ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఒక్కసారిగా అయన మార్కెట్ పడిపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన డిస్కో రాజా సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఇప్పుడు ఆయనకు మస్ట్ నీడెడ్ హిట్ పడాల్సిన టైం వచ్చింది. అప్పుడెప్పుడో రాజ ది గ్రేట్ సినిమా తో హిట్ అందుకున్న రవితేజకు ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు. అందుకే తనకు బలుపు, డాన్ శ్రీను లాంటి హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని తో క్రాక్ అనే సినిమా చేశాడు.
ఆ సినిమా నెలకొల్పిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఈ జోష్ లో రవితేజ ఖిలాడీ అనే సీనియా చేస్తున్నాడు. వీర లాంటి సినిమా చేసిన రమేష్ వర్మ ఈ సినిమా తో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.. తనలోని డైరెక్టర్ ప్రతిభ ను చూసి రవితేజ మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో మాస్ మహరాజా రవితేజ కలయికలో రానున్న సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు. ఒకరు ప్రియాంక అరుల్ మోహన్ కాగా మరో హీరోయిన్ గా నభా నటేష్ నటించబోతుందని తెలుస్తోంది.
అయితే ప్రియాంక అరుల్ మోహన్ మెయిన్ హీరోయిన్ అట. ఈ మధ్య వరుస సినిమాలలో ఫుల్ బిజీగా ఉంది ప్రియాంక. ఇప్పుడు రవితేజ సినిమాలో కూడా ప్రియాంక అరుల్ మోహన్ కనిపించబోతుంది. కాగా ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందట.ముఖ్యంగా సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ మంచి కామెడీ టైమింగ్ తో ఉంటుందని తెలుస్తోంది. పైగా త్రినాథరావ్ నక్కిన గత చిత్రాలు కూడా ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్ వంటి సినిమాలు మంచి ఎంటెర్టైమెంట్ తో సాగిన విషయం తెలిసిందే.