టక్ జగదీష్ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

న్యాచురల్ స్టార్ నాని ని కరోనా దెబ్బ మీద దెబ్బ కొడుతుంది.. అసలే కరోనా తొలి దశ ఎఫెక్ట్  అయన  'వి' సినిమా పై పడి ఆ సినెమా అని ఫ్లాప్ అయ్యేలా చేసింది.. మంచి అంచనాలతో వచ్చిన ఆ సినిమా లో సుధీర్ బాబు కూడా మరో హీరోగా నటించగా ఆ సినిమా ప్లాప్ గా ఇద్దరి కెరీర్ లో మిగిలిపోయింది..  అయితే ఇప్పుడు అయన రాబోయే సినిమాలపై కూడా కరోనా ఎఫెక్ట్ చూపిస్తుంది.. ప్రస్తుతం నాని మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. వాటిలో ముందుగా శివ నిర్వాణ దర్శకత్వంలోని టక్ జగదీష్ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది.

ప్రమోషన్స్ లో భాగంగా పాత్రల పరిచయ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఆ తరువాతనే కరోనా ఉద్ధృతి పెరుగుతూ రావడంతో, విడుదలను వాయిదా వేసుకున్నారు. థియేటర్లు కూడా మూతబడిపోయాయి. ఇక ఇప్పుడు పరిస్థితి కాస్త ఆశాజనకంగా కనిపిస్తోంది. వచ్చేనెల నుంచి థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో తెరుచుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

థియేటర్లు ఓపెన్ కాగానే 'టక్ జగదీష్'ను వదలాలనే ఆలోచనలో ఉన్నారట. అనుకోకుండా ఏదైనా సమస్య తలెత్తితే మాత్రమే ఆగస్టుకు వెళదామనీ, లేదంటే జులైలో విడుదలకు వెళదామనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ఒక ముఖ్యమైన పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడు. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.