‘టైగర్ నాగేశ్వరరావు’లో హేమలతా లవణం గారి పాత్ర పోషించడం నా పూర్వజన్మ సుకృతం: రేణు దేశాయ్!!

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్‌ ల క్రేజీ కాంబినేషన్‌ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్. గ్రిప్పింగ్ టీజర్, మ్యాసివ్ ట్రైలర్, చార్ట్‌బస్టర్ పాటలతో టైగర్ ఇప్పటికే నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపధ్యంలో ఈ చిత్రంలో కీలకమైన హేమలతా లవణం పాత్ర పోషించిన నటి రేణు దేశాయ్ విలేకరుల సమావేశంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ విశేషాలని పంచుకున్నారు.

హేమలత లవణం పాత్ర గురించి చెప్పండి ?
హేమలతా లవణం గారిది లార్జర్ దేన్ లైఫ్ పర్సనాలిటీ. ఆ రోజుల్లోనే చంబల్, బుందేల్ ఖండ్ వెళ్ళి అక్కడ డెకాయిట్  లని కలిసి అనేక రిఫార్మ్స్ చేశారు. అలాగే జోగిని వ్యవస్థపై, అంటరానితనం పై పోరాటం చేశారు. హేమలత లవణం గారు ఈ సినిమా ద్వారా యంగర్ జనరేషన్ ఆడియన్స్ లో స్ఫూర్తిని నింపుతారు. ఇలాంటి గొప్ప పాత్ర చేయడం నా పూర్వజన్మ సుకృతం. టైగర్ నాగేశ్వరరావు బిగ్ మూవీ. దర్శకుడు వంశీ ఈ సినిమా  తో నేషనల్ లెవల్ కి వెళ్తారు. అభిషేక్ గారి నిర్మాణంలో పని చేయడం, రవితేజ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం కూడా ఒక గౌరవంగా భావిస్తున్నాను. అన్నిటికంటే హేమలత లవణం గారి పాత్ర పోషించడం నా అదృష్టంగా భావిస్తాను.  

ఈ పాత్ర చేయడానికి ఎలా ప్రిపేర్ అయ్యారు ?
ఆవిడ గురించి తెలుకోవడానికి కొంతమందిని కలిశాను. లవణం గారి మేనకోడలు కీర్తిగారిని విజయవాడలో కలిశాను. ఆవిడ గురించి చాలా సమాచారం ఇచ్చారు. ఈ పాత్ర చేసినప్పుడు అవన్నీ సహాయపడ్డాయి, సహజంగా నేను మాట్లాడేటప్పుడు నా తల ఎక్కువగా కదులుతుంది. కానీ హేమలత లవణం గారు చాలా స్థిరంగా హుందాగా ఉంటారు. అలా స్థిరంగా వుండే బాడీ లాంగ్వేజ్ పై వర్క్ చేశాను. అలాగే తెలుగుని కూడా స్పష్టంగా ప్రిపేర్ అయ్యాను. ఆమెలా కనిపించడానికి చాలా నిజాయితీగా ప్రయత్నించాను. ఈ పాత్ర నాకు చాలా తృప్తిని ఇచ్చింది.

హేమలతా లవణం గారి పాత్ర మీలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది ?
చాలా మార్పు తెచ్చింది. సామాజికంగా ఇప్పటివరకూ చేసింది సరిపోదనిపించింది. ఇంకా పని చేయాలనిపించింది. చిన్న పిల్లలు ఎవరూ ఆకలితో వుండకూదనేది నా లక్ష్యం. ఎంతవరకూ కుదిరితే అంత ఆ దిశగా పని చేయాలి.

హీరోయిన్, డిజైనర్, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఈ జర్నీ ఎలా వుంది ?
డిజైనర్ విషయంలో మీకో క్లారిటీ ఇవ్వాలి. నేను డిజైనర్ ని కాదు. నేను ఒరిజినల్ స్టయిలిస్ట్ ని. డిజైనర్ వర్క్ వేరు. నాకు కలర్స్ పై మంచి అవగాహన వుంది. నేను ఆర్ట్స్ స్టూడెంట్ ని. ఏ కలర్ ఏది మ్యాచ్ అవుతుందో నాకు అర్ధమౌతుంది. నేను స్టయిలిస్ట్ ని మాత్రమే. స్టయిలింగ్ కూడా నేను ప్లాన్ చేసి చేసింది కాదు. ఖుషి సినిమాకి ముందు కళ్యాణ్ గారితో షాపింగ్ కి వెళ్ళినపుడు నా స్టయిలింగ్ సెన్స్ ఆయనకి  నచ్చింది. నువ్వే చేసేయ్ అన్నారు. అలాగే సామాజిక కార్యక్రమాలు, కవిత్వం రాయడం, ఇవన్నీ కూడా ప్లాన్ చేసి చేసినవి కాదు.  

రవితేజ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
రవితేజ గారితో పని చేయడం చేయడం ఖచ్చితంగా గొప్ప అనుభూతి. రవితేజ గారి గురించి ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మరింత చెప్తాను. దీని కోసం ప్రత్యేకంగా ఒక స్పీచ్ కూడా ప్రిపేర్ చేశాను.

నటనకి చాలా విరామం ఇచ్చారు కదా ?
నాకు నటించేలానే వుంది. కానీ కథ. పాత్ర, దర్శకుడు, నిర్మాత ఇవన్నీ కలసి రావాలి. ఇప్పుడు  టైగర్ నాగేశ్వర రావుకి మూడు కలిసొచ్చాయి. మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తాను.    

‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా విషయంలో ఇప్పటివరకూ మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ?
ట్రైలర్ చూసిన మా అమ్మాయి .. వయసుకు తగ్గ పాత్ర చేసినందుకు చాలా గర్వంగా వుందమ్మా’ అని చెప్పింది. ఇది నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్.

అకీరా హీరోగా ఎప్పుడు పరిచయం అవుతారు ?
హీరోగా చేయాలనే ఆసక్తి అకీరాకి ఈ క్షణం వరకూ లేదు. అకీరాది చాలా భిన్నమైన వ్యక్తిత్వం. పియానో నేర్చుకున్నాడు. అలాగే ఫిల్మ్ ప్రొడక్షన్ గురించి కూడా  నేర్చుకున్నాడు. యోగా, మార్సల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ ఇవన్నీ నేర్చుకున్నాడు. తనకి రైటింగ్ ఇష్టం. ఒక స్క్రిప్ట్ కూడా రాశాడు. అయితే ఇప్పటి వరకు నటుడిని అవుతానని  మాత్రం చెప్పలేదు. తను హీరో అవ్వాలని డిసైడ్ అయితే అందరికంటే ముందు నేనే ప్రకటిస్తా.  

అకీరా సినిమాల్లోకి రావాలని మీరు కోరుకుంటారా ?
తన కొడుకుని బిగ్ స్క్రీన్ పై చూడాలని ప్రతి తల్లికి వుంటుంది. నాకు కూడా వుంది. అయితే హీరో కావాలని ముందు తనకి అనిపించాలి. తను చూడటానికి అందంగా ఉంటాడు. ఒక నటుడికి కావాల్సిన అన్ని క్వాలిటీ లు తనలో వున్నాయి. నేను ఒక నటిని. వాళ్ళ నాన్న, పెదనాన్న యాక్టర్స్. తను తెరపై ఎలా కనిపిస్తాడో చూడాలని తల్లిగా నాకూ వుంటుంది.

అభిషేక్ అగర్వాల్ గారి నిర్మాణంలో చేయడం ఎలా అనిపించింది ?
ఇప్పటివరకూ నేను పని చేసిన నిర్మాణ సంస్థలన్నీ చాలా గౌరవంగా చూశాయి. అయితే టైగర్ నాగేశ్వరరావు లో నేను హీరోయిన్ కాదు. దీంతో పాటు చాలా రోజుల తర్వాత నటిస్తున్నాను. ట్రీట్మెంట్ ఎలా వుంటుందో అని కాస్త భయపడ్డాను. అయితే అభిషేక్ భయ్యా, అర్చన ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా అయిపోయారు. ఎంతో గౌరవంగా మర్యాదగా జాగ్రత్తగా చూసుకున్నారు. ఈ సినిమా జరిగినంత కాలం నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. ఈ సినిమా చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.  

నటన కొనసాగిస్తారా ?
నాకు నటన ఎప్పుడూ కొనసాగించాలనే వుంటుంది. నా వయసుకు తగ్గ మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.