
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ కి తెలుగులో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. అయన సినిమాల్లో చమత్కారంతో పాటు మంచి కమర్షియాలిటీ కూడా నిండి ఉంటుంది.. మొదటినుంచి అయన సినిమా ల్లో ఇది ఎక్కడ కూడా మిస్ కాకుండా చూసుకున్నారు. అయన డైరెక్టర్ గా చేయని సినిమాల్లో కూడా అయన తనదైన మార్క్ ఉండేలా చూసుకుంటారు.. మాటలమాంత్రికుడు గా త్రివిక్రమ్ కి ఇండస్ట్రీ లో ప్రత్యేక గుర్తింపు ఉందంటే అయన రాసే డైలాగ్ ల్లో ఎంతటి డెప్త్, పంచ్ లు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

ఇక త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమా తో డైరెక్టర్ గా తన ప్రయాణం మొదలుపెట్టారు. అప్పటినుంచి ఒక్కో మెట్టు మెట్టు ఎదుగుతూ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ప్రస్తుతం అయన ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.. అయితే త్రివిక్రమ్ సంగీతం విషయంలో మాత్రం ఎంతో క్లారిటీ గా ఉంటాడు.. అందుకే అయన సినిమాలు హిట్ ఆల్బమ్స్ గా నిలుస్తుంటాయి. మొదట్లో మణిశర్మ తో ఎక్కువగా సంగీతం చేయించుకునే అయన ఆ తర్వాత దేవి శ్రీ ప్రసాద్ తో కలిసి పనిచేసేవారు..

కానీ అ ఆ నుంచి దేవి ని పక్కన పెట్టి వేరే మ్యూజిక్ డైరెక్టర్ లతో వెళ్తున్నాడు త్రివిక్రమ్.. ప్రస్తుతం తమన్ తో వరుస సినిమాలు చేస్తున్నాడు. .. వీరి కాంబో లో వచ్చిన అలవైకుంఠపురం సినిమా ఏ లెవెల్లో హిట్ అయిందో అందరికి తెలిసిందే.. ఈ నేపథ్యంలో త్రివిక్రం - దేవీశ్రీప్రసాద్ల మధ్య గ్యాప్ వచ్చినట్టే అనుకున్నారు. కానీ ఇటీవల రంగ్ దే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో ఇద్దరు చాలా క్లోజ్‌గా కనిపించారు. రంగ్ దే సాంగ్స్ గురించి కూడా త్రివిక్రం పొగడ్తలతో ముంచేశాడు. దాంతో మళ్ళీ త్వరలో ఈ ఇద్దరు కలిసి పని చేయబోతున్నారన్న ప్రచారం మొదలైంది. చూడాలి మరి నిజంగా ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీటవుతుందా లేదా. ఉప్పెన సినిమాతో మెగాస్టార్ నుంచి ప్రశంసలు అందుకున్న దేవీకి మళ్ళీ మెగాస్టార్ సినిమాకి మ్యూజిక్ అందించే ఛాన్స్ వచ్చిందన్న టాక్ కూడా వినిపిస్తోంది.