ఈ టీజర్ ఇచ్చి పడేసింది అంటున్న ప్రేక్షకులు..!

తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వరస సినిమాలతో దూసుకుపోతున్న నటుడు ప్రియదర్శి. కేవలం కమెడియన్ గానే కాకుండా ఒక మంచి నటుడిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటున్నారు. ఇటీవలే జాతిరత్నాలు చిత్రంతో హ్యూజ్ సక్సస్ ను అందుకున్నారు. అలాగే మెయిల్ సిరీస్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగుతెరపై మరో ప్రామిసింగ్ నటుడిగా ముద్ర వేసుకున్నారు.

ఇటీవలే ఆయన చేసిన మరో వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధమైంది. ప్రియదర్శి, నందిని రాయ్ ప్రధాన పాత్రల్లో విద్యసాగర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమ్ అవనుంది. దీనికి సంబంధించిన టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఆహా నుంచి మరో మంచి అవుట్ పుట్ రాబోతుందని ప్రేక్షకులు అంటున్నారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమ్ అవనుంది.

ఇదిలా ఉంటె వరస చిత్రాలతో ఆహా దూసుకుపోతోంది. ఇటీవలే విడుదలైన ఏక్ మినీ కథ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఒక విన్నూత్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కింది. అలాగే థాంక్ యు బ్రదర్, ప్లే బ్యాక్ చిత్రాలతో పాటు, 11th అవర్ లాంటి వెబ్ సిరీస్ కూడా మంచి రేపాన్స్ తెచ్చుకుంటున్నాయి. వీటితో పాటు డబ్బింగ్ చిత్రాలు కూడా మంచి రేటింగ్ ను తెచ్చుకుంటున్నాయి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.