ఎంట‌ర్‌టైన్‌మెంట్‌.. ఎమోష‌న్స్ కాంబినేష‌న్‌లో అల‌రించ‌నున్న ‘ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌’.. ఆక‌ట్టుకుంటున్న ట్రైల‌ర్‌!!

బిగ్ బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’. ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్‌పై ఎ.ఆర్‌.అభి దర్శ‌క‌త్వంలో హ‌రిత  గోగినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 30న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్బంగా శ‌నివారం ‘ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌’ ట్రైలర్‌ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే..

ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.అభి సినిమాను ఎంట‌ర్‌టైనింగ్‌గా మ‌లిచిన‌ట్లు స్పష్ట‌మ‌వుతుంది. లైఫ్‌లో డ‌బ్బులు సంపాదించాల‌నుకునే ఓ యువ‌కుడు ఏం చేయాల‌ని తెగ ఆలోచిస్తాడు. కోటీశ్వ‌రుల కూతురుని ప్రేమించి పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిలైపోతుంద‌ని భావించి అమ్మాయిల వెంట‌ప‌డ‌తాడు. చివ‌ర‌కు ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. నిజంగా ఆ అమ్మాయి డ‌బ్బున్న అమ్మాయేనా? ప్రేమించాలంటే డ‌బ్బులు మాత్ర‌మే ఉండాలా? అనే ఓ పాయింట్‌పై ద‌ర్శ‌కుడు ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌ను ఎంత ఆస‌క్తిక‌రంగా తెరెక్కించాడ‌నే తెలియాలంటే డిసెంబ‌ర్ 30న సినిమాను చూడాల్సిందే.

అయితే ట్రైల‌ర్‌ను చూస్తుంటే చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా, ఎమోష‌న‌ల్‌గా సినిమా ఉంటుంద‌ని  తెలుస్తుంది. ఇక సోహైల్ న‌ట‌న ట్రైల‌ర్‌లో సింప్లీ సూప‌ర్బ్‌. ఇక సినిమా ఆసాంతం త‌ను ఎలా నవ్విస్తాడు.. ఎలా ప్రేమ‌లో ప‌డేస్తాడ‌నేది సినిమా చూడాల్సిందే.

నిర్మాత హ‌రిత గోగినేని మాట్లాడుతూ ‘‘త‌ల్లిదండ్రుల ప్రేమానురాగాలు.. అమ్మాయి ప్రేమ ... ఏదీ త‌క్కువ కాదు. అలాంటి వాటి కంటే డ‌బ్బు గొప్ప‌దా అనే పాయింట్‌ను మా ద‌ర్శ‌కుడు అభి ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ సినిమా రూపంలో  అందంగా తెర‌కెక్కించారు. హీరో సోహైల్ త‌న‌దైన న‌ట‌న‌తో అద్భ‌తుంగా న‌టించారు. డిసెంబ‌ర్ 30న సినిమా చూస్తే మీరే చెబుతారు. మేం కూడా చాలా ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాం. మంచి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నామని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు.

హీరో సోహైల్ మాట్లాడుతూ ‘‘రీసెంటుగా రిలీజైన టీజ‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ట్రైల‌ర్‌కు కూడా దాన్ని మించిన రేంజ్ రెస్పాన్స్ వ‌స్తుంది. నేను ప‌డ్డ క‌ష్టానికి డిసెంబ‌ర్ 30న రిజ‌ల్ట్ వ‌స్తుంద‌ని అనుకుంటున్నాను. ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ అంద‌రినీ మెప్పించే సినిమా అవుతుంది’’ అన్నారు. .

ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.అభి మాట్లాడుతూ ‘‘టీజర్ చూసి అప్రిషియేట్ చేసిన ఆడియెన్స్ నుంచిట్రైలర్‌కి కూడా అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ ఎంట‌ర్‌టైన్మెంట్‌తో న‌వ్విస్తాడు.. మిమ్మ‌ల్ని ప్రేమ‌లో ప‌డేస్తాడు.. ఎమోష‌నల్‌గా మీ హృద‌యాల‌కు ద‌గ్గ‌ర‌వుతాడు. సోహైల్ ఈ సినిమాతో మంచి హీరోగా ప్రూవ్ చేసుకుంటాడు’’ అన్నారు.


న‌టీన‌టులు:  
స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష‌, దేవీ ప్ర‌సాద్‌, రాజా ర‌వీంద్ర‌, స‌మీర్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, షాని త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌:  ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌,  నిర్మాత‌: హ‌రిత గోగినేని, క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఆర్‌.అభి, మ్యూజిక్‌: అనూప్ రూబెన్స్‌, సినిమాటోగ్ర‌ఫీ:  ఐ.అండ్రూ, ఎడిట‌ర్‌: ప్ర‌వీణ్ పూడి, పాట‌లు:  భాస్క‌ర‌భ‌ట్ల‌, కొరియోగ్ర‌ఫీ:  విశాల్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  విజ‌యానంద్ కీత‌, పి.ఆర్‌.ఒ:  నాయుడు - ఫ‌ణి (బియాండ్ మీడియా).

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.