ఇన్స్టాగ్రామ్ లో టాప్ హీరోయిన్ లే...

సోషల్ మీడియా వేదికలైన ఫేస్ బుక్, ట్విట్టర్ లలో హీరోయిన్ల కంటే హీరోలకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండటం సహజం, కాని ఇన్స్టాగ్రామ్ విషయానికి వస్తే మాత్రం స్టార్ హీరోల కంటే కూడా ఎక్కువగా హీరోయిన్లకే ఫాలోవర్స్ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ ఎక్కువగా ఫోటోల పై ఆధార పడిన వేదిక కాబట్టి అభిమానులు తమ ఫేవరేట్ హీరోయిన్ల తాజా అప్డేట్స్ కోసం, వారి ఫొటోస్ కోసం వారిని ఇన్స్టాగ్రామ్ లోనే ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఇతర సోషల్ మీడియా వేదికల్లో హీరోలకి సంభందించిన వివరాలు ఎక్కువగా, త్వరగా పోస్ట్ అవుతుంటాయి. ఈ కారణంగా హీరోయిన్స్ కూడా తమ అభిమానుల కోసం తమ గురించిన వివరాలు, తమ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో తరచూ పోస్ట్ చేస్తుంటారు. హీరోలతో పోలిస్తే తెర పై వారు కనిపించే సమయం చాల తక్కువ కాబట్టి కొన్ని కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ తమ అభిమానుల్ని సంతోష పరుస్తూ వారు కూడా డబ్బులు వెనకేసుకుంటారు.

తాప్సీ

ఝుమ్మంది నాదం, మిస్టర్ పెర్ఫెక్ట్ లాంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసిన తాప్సీ, బాలీవుడ్ లో వరసగా సినిమాలు చేస్తూ, దేశ వ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. హిందీలో ఆవిడ నటించిన అన్ని సినిమాలు దాదాపు విజయవంతమైనవే. వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ ఆవిడ తన సత్తా చాటుతున్నారు. ఆవిడ కూడా పలు రకాల కమర్షియల్ యాడ్స్ చేస్తూ అభిమానుల్ని సంతోష పరుస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఆవిడను 17.8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ట్విట్టర్ లో ఆవిడను 4.3 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా, ఫేస్ బుక్ లో 7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు

కాజల్ అగర్వాల్

లక్ష్మికళ్యాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కాజల్ చందమామ, మగధీర లాంటి చిత్రాలలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. అందం, అభినయం కలబోతగా ఉండే కాజల్ అనతికాలంలోనే తెలుగులోని స్టార్ హీరోలందతో నటించారు. దక్షినాది భాషలతో పాటు ఆవిడ ఉత్తరాదిన కూడా పలు చిత్రాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కాగా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆవిడను  15.5 మిలియన్ల అభిమానులు ఫాలో అవుతున్నారు. ట్విట్టర్ లో ఆవిడను ఫాలో అయ్యేవారి సంఖ్య 4.4 మిలియన్స్ కాగా ఈ సంఖ్యా ఫేస్ బుక్ లో 23.5 మిలియన్స్

శృతి హాసన్

లోక నాయకుడయిన కమల్ హాసన్ కూతురైనప్పటికీ తన సొంత ట్యాలెంట్ తో చిత్ర పరిశ్రమలో తన దైన ముద్ర వేశారు శృతి. దక్షినాది భాషలతో పాటు హిందీ లో కూడా ఆవిడ పలు చిత్రాలలో నటించారు. సంగీతం పైన ఉన్న మక్కువ తో ఆవిడ ఒక మ్యూజిక్ బ్యాండ్ ని కూడా ఏర్పాటు చేసి అంతర్జాతీయంగా కూడా ఖ్యాతి ని గడించారు. ట్రెడ్ స్టోన్ అనే ఒక అమెరికన్ వెబ్ సిరీస్ లో కూడా ఆమె తళుక్కున మెరిసారు. ఆవిడను ఇన్స్టాగ్రామ్ లో ఆవిడను 14.9మిలియన్ల మంది అభిమానులు రోజూ ఫాలో అవుతున్నారు. ట్విట్టర్ లో ఆవిడను ఫాలో అయ్యేవారి సంఖ్య 7.7 మిలియన్స్ కాగా, ఫేస్ బుక్ లో 8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

సమంత

ఏమాయ చేసావే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న సమంత, ఆ తర్వాత అనతి కాలంలోనే తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ అయ్యారు. అడపా దడపా ఇతర భాషల్లో కూడా నటించే ఆవిడ తన భర్తతో కలిసి ప్రాముఖ సోప్ బ్రాండ్ అయిన రెక్జోనాకు బ్రాండ్ అంబాజిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఆవిడను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వారి సంఖ్య 12.9 మిలియన్స్. ట్విట్టర్ లో ఆవిడను ఫాలో అయ్యేవారి సంఖ్య 8.4 మిలియన్స్ కాగా, ఫేస్ బుక్ లో 9 మిలియన్ల మంది ఆవిడను ఫాలో అవుతున్నారు.

పూజా హెగ్డే

ముకుందా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పూజ ఒక లైలా కోసం, అరవింద సమేత, మహర్షి, అల వైకుంటపురంలో లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా నటించే ఆవిడ బాలివుడ్ లోను నటిస్తూ అక్కడ కూడా తన కంటూ ఒక ప్రత్యకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు. కాగా ఆవిడను ఇన్స్టాగ్రామ్ లో 11.9 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ట్విట్టర్ లో ఆవిడను ఫాలో అయ్యేవారి సంఖ్య 2.8 మిలియన్స్ కాగా, ఫేస్ బుక్ లో 2.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

తమన్నా భాటియా (tamannaahspeaks)

శ్రీ చిత్రంతో తెలుగు తెరంగేట్రం చేసిన తమన్నా శేఖర్ కమ్ముల  దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ చిత్రంతో యువతర అభిమానాన్ని చూరగొన్నారు. తెలుగు, తమిళ భాషాల్లో  ఊసరవెల్లి, ఆవారా లాంటి చిత్రాలలో నటించిన తమన్నా బాహుబలి చిత్రంతో అంతర్జాతీయంగా గుర్తింపును పొందారు. ఆమెను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యేవారి సంఖ్య 11.4 మిలియన్స్. ట్విట్టర్ లో ఆవిడను ఫాలో అయ్యేవారి సంఖ్య 4.8 మిలియన్స్ అవ్వగా, ఫేస్ బుక్ లో ఆవిడను 12 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు

రష్మిక మండన్న

ఛలో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక తక్కువ టైమ్ లో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు. చేతి నిండా సినిమాలతో బిజీ, బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే ఆవిడను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యేవారి సంఖ్య 10.1 మిలియన్ మార్క్ ను దాటింది. మిగితా వారితో పోలిస్తే రష్మిక త్వరగా ఆ మార్క్ ను చేరుకున్నారు. ట్విట్టర్ లో ఆవిడను ఫాలో అయ్యేవారి సంఖ్య 2.2 మిలియన్స్ అయితే ఫేస్ బుక్ లో 1.8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.