పోసాని గారి అబ్బాయి కూడా రచయితే

పోసాని కృష్ణమురళి గారి కామెడీ టైమింగ్ గురించి , ఆయన రాసిన సినిమా డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పోసాని గారి పెరు చెప్తే కొంతమంది మెంటలోడు అని అంటారు ,కొంతమంది ఆయనలోని మంచి దర్శకుడుని , రైటర్ ని గుర్తుచేసుకుంటారు. ప్రస్తుతం ఆయాన తెలుగు ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉన్న కమెడియన్స్ లో ఒకరు. ఒకప్పుడు రైటర్ గా , దర్శకుడుగానే ఫేమస్ అయిన పోసాని గారు రామ్ చరణ్ హీరోగా నటించిన నాయక్ సినిమాతో ఒక్కసారిగా టాప్ కమెడియన్ అయిపోయారు.

అప్పటిదాకా ఆయన సినిమాలోనే ఎక్కువ నటించే పోసాని గారు వరసగా స్పెషల్ పాత్రలు చేయడం  మొదలుపెట్టారు. ఈయన దగ్గర అసిస్టెంట్స్‌గా పని చేసిన త్రివిక్రమ్, కొరటాల లాంటి వాళ్లు పోసాని కృష్ణమురళి దగ్గరే సహాయకులుగా పని చేసారు. వాళ్లిప్పుడు స్టార్ డైరెక్టర్స్ అవ్వడమే కాకుండా వారి సినిమాల్లో పోసాని గారికి మంచి పాత్రలు కూడా ఇచ్చారు. అయితే అంత ఫేమస్ అయినా కూడా ఈయన వ్యక్తిగత జీవితం గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు.

ఆయన ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితం , ఆయన పిల్లల గురించి ఎక్కడ నోరు విప్పి చెప్పలేదు. ఇదిలా ఉంటే పోసాని గారికి ప్రజ్వల్ అనే  కొడుకు ఉన్నాడని చాలా మందికి తెలియదు.ప్రజ్వల్ కూడా తండ్రి పోసాని గారిలానే దర్శకుడిగా మారిపోయాడు.  ఇప్పటికే  లాస్ ఏంజిల్స్‌లో దర్శకత్వ శాఖకు సంబంధించిన కోచింగ్ తీసుకుని వచ్చాడు ప్రజ్వల్.ఆ తర్వాత పోసాని గారు ప్రజ్వల్ ని తన మేనల్లుడు కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేర్చారు.

కొరటాల శివ తెరకెక్కించిన భరత్ అనే నేను సినిమాకి సహాయ దర్శకుడిగా పనిచేశాడు ప్రజ్వల్. ఈ విషయాన్ని పోసాని ఒకసారి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ప్రజ్వల్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టమట. ఆయనతో ఒక్క సినిమా చేయాలని ప్రజ్వల్ కోరిక అని టాక్. అయితే మంత్రిగారు మాటిచ్చారు అనే సినిమాతో తన దర్శకత్వంలో మొదటి అడుగు వేసాడు. ఈ సినిమా గురించి పక్కన పెడితే ప్రజ్వల్ కూడా తండ్రి లానే డైరెక్టర్ అవ్వడం నిజంగా విశేషం అని చెప్పాలి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.