Don't know about the timer here, but soon exploding with excitement 💥 will be done@PrimeVideoIN @BajpayeeManoj @sharibhashmi @Samanthaprabhu2 @shreya_dhan13 @SharadK7 @SrikantTFM #Priyamani #TheFamilyManOnPrime pic.twitter.com/udPCeDcY59
— BARaju (@baraju_SuperHit) December 29, 2020
ఇండియన్ వెబ్ సిరీస్ లలో ది ఫ్యామిలీ మ్యాన్ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. 2019లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఈ వెబ్ సిరీస్ లో మనోజ్ బాజ్పాయ్ లీడ్ రోల్ లో నటించగా ప్రియమణి ఆయన భార్యగా నటించింది. చాలా ఆసక్తికరంగా నడిచిన ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన సీక్వెల్ ఈ ఏడాది రూపొందిన విషయం తెల్సిందే. ది ఫ్యామిలీ మ్యాన్-2 లో సమంత యాడ్ అవ్వడంతో వెబ్ సిరీస్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో ఆమెది నెగటివ్ రోల్. కొద్ది నెలల క్రితమే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తవ్వగా ఇప్పుడు దీనికి సంబంధించిన విడుదల ప్రకటన వచ్చింది. నిజానికి ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు విడుదల చేస్తారు అంటూ చాలా మంది సోషల్ మీడియాలో నిర్మాతలను ప్రశ్నించారు. రాజ్ అండ్ డీకే ద్వయం ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఫిబ్రవరి 12న ది ఫ్యామిలీ మ్యాన్ 2ను విడుదల చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ విడుదలవుతోంది.