
తెలుగు సినిమాల్లో హీరోలు ఎంత స్టైల్ గా ఉండే వాళ్ళో విలన్లు వాళ్ళకి ఆపోజిట్ గా ఉండే వాళ్ళు. అయితే 90వ దశకంలో ఈ ధోరణిని మారుస్తూ కొంతమంది విలన్లు స్టైల్ గా కనిపించి కొత్త ట్రెండ్ సృష్టించారు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా తమ విలనిజంతో టాప్ గేర్ లో దూసుకుపోయిన నటులు వీళ్ళే.
రావు గోపాలరావు

మన చిత్రపరిశ్రమలో ఉన్న నటులలో మహా నటుడు ఈయన. తన ఆహార్యంతో, తన సామెతలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటుడు. సినిమాలో ఆయన పాత్ర చిన్నదైన పెద్దదైన ఆ పాత్ర మాత్రం ఖచ్చితంగా గుర్తుండిపోతుంది.
కోటా శ్రీనివాస రావు

వెండి తెరపై మర్చిపోలేని నటుడు కోటా గారు. ఎన్నో పాత్రలను అవలీలగా చేయగల నటులలో ఆయన ఒకరు. ప్రాణం ఖరీదు సినిమాతో నటుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. శివ, మనీ మనీ, అనుకోకుండా ఒక రోజు లాంటి సినిమాల్లో ఆయన నటన చాలా స్టైల్ గా ఉంటుంది.
తనికెళ్ళ భరణి

కోటా గారి తర్వాత చిత్ర రంగ ప్రవేశం చేసిన నటుడు తనికెళ్ళ భరణి. నటుడిగానే కాకుండా రచయితగా కూడా ఆయన ఎన్నో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. లేడీస్ టైలర్ సినిమా నుండి మొన్నటి జాతి రత్నాలు వరకు ఎన్నో చిత్రాల్లో నటించారు. భరణి గారి శైలి కూడా డిఫరెంట్ గా ఉంటుంది.
రఘువరన్

అప్పటి వరకూ కేవలం తమిళ భాషలోనే పాపులర్ అయిన రఘువరన్ తెలుగులో శివ సినిమాతో ఫేమస్ అయ్యారు. అంతకు ముందు రుద్రనేత్ర, లంకేశ్వరుడు లాంటి సినిమాల్లో నటించినా శివ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో రిజిస్టర్ అయ్యారు. “రెండు లారీల జనాల్ని తీసుకెళ్ళి వాడ్ని చంపించు” అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.
మోహన్ బాబు

విలన్ గా ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు మోహన్ బాబు గారు. ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన హావాభావాలను పలికించే విధానం అన్ని కొత్తగా ఉండేవి. అప్పట్లో చిరంజీవి గారి చాలా సినిమాల్లో మోహన్ బాబు గారు ఉండేవారు. వీరిద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్. ఒకపక్క హీరోగా చేస్తూనే విలన్ పాత్రలను కూడా చేసేవారు.
చరణ్ రాజ్

ప్రతిఘటన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన చరణ్ రాజ్ ఆ తర్వాత చాలా సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు. చివరగా నాని హీరోగా నటించిన పైసా సినిమాలో నటించారు.
టైగర్ ప్రభాకర్

కన్నడ ప్రభాకర్ గా పిలవబడే ఈయన దాదాపు 450 సినిమాల్లో విలన్ గా నటించారు. కన్నడ భాషలో ఇంగ్లిష్ పదాలు కలిపి డైలాగ్ లు కొట్టడం ఈయన ప్రత్యేకత.
నాజర్

ద్రోహి లాంటి సినిమాలో తన నటనతో ప్రేక్షకులను బయపెట్టిన నాజర్ కూడా విలన్ గా చాలా పాపులర్ అయ్యారు. తన మార్క్ ఎక్స్ప్రెషన్స్ తో ఇప్పటికీ విలన్ గా చేస్తూనే ఉన్నారు.
రామిరెడ్డి

తన తలపై చేతితో నిమురుకుంటూ ఆయన ఎవర్నైన చంపే ప్లాన్ వేస్తాడు. ఆయన చూపులు, ఆ రూపం చూడటానికే భయం వేస్తుంది.
అమ్రేష్ పురి

“వినాశ్ కాలా విపరీత బుద్ధి” ఈ డైలాగ్ వింటే ఒక ఫేస్ మన మైండ్ లోకి వచ్చేస్తుంది. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ డైలాగ్ డెలివరీతోనే బయపెట్టేవాడు అమ్రేష్ పురి.
పరేష్ రావల్

రాంగోపాల్ వర్మ సినిమాల్లో ఎక్కువగా కనిపించేవారు. క్షణ క్షణం, గోవింద గోవింద లాంటి సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు ఆయన.
శ్రీ హరి

మోహన్ బాబు గారి బాటలో హీరోగా చేస్తూనే విలన్ పాత్రలను కూడా చేశారు. ఈయన స్టైల్ కూడా చాలా కొత్తగా ఉండేది. విలన్ పాత్రలే కాకుండా ఎన్నో మంచి పాత్రలు చేశారు.