దేవరకొండ ఇంట్లో ‘దీపాల ఆవళీ’

విజయ్ దేవరకొండ  దీపావళి సంప్రదాయబద్దంగా  ఇంట్లో గడిపాడు. సినిమా ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేకుండా పైకి రావాలంటే పెట్టి పుట్టాలి. అలా పెట్టి పుట్టినోడే విజయ్ దేవరకొండ.  టాలీవుడ్ క్రేజీ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘ఫైటర్’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్‌లో వస్తోంది. ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. ఫైటర్‌లో విజయ్‌కు జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో భాగంగా ముంబైలో 40 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకుంది. అయితే ఆ తర్వాత షెడ్యూల్ కూడా ముంబైలోని ధారవిలో జరగాల్సీవుండగా ఈ సినిమా 40 శాతం పూర్తి అయింది. లాక్డౌన్ తర్వాత ఇంకా షూటింగ్ స్టార్ట్ చెయ్యలేదు. డిసెంబర్ నుండి షూటింగ్ అనుకుంటున్నారు.ఈ  కరోనా వల్ల చాలా మంది హిరో, హిరోయిన్స్ ఇంట్లో సరదాగా గడుపతున్నారు. విజయ్ కూడా ఈ దీపావళీ ఇంట్లో సరదగా గడిపాడు. దీనికి సంబంధించి ఫ్యామిలి తో కలిసి దిగిన ఫోటో ఇన్ స్టాగ్రా మ్ లో పోస్ట్ చేశాడు విజయ్.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.