గౌతమ్ తో ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీకి పూర్తి ప్రాధాన్యతను ఇస్తాడన్న విషయం తెల్సిందే. సినిమానా, కుటుంబమా అన్న ప్రశ్న వస్తే ముందు కుటుంబానికే తన ప్రాధాన్యతను ఇస్తాడు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కానీ ఫ్యామిలీకి తగిన ప్రాధాన్యతను ఇవ్వడం వాళ్ళను ట్రిప్స్ కు తీసుకెళ్లడం తరుచూ  చేస్తుంటాడు. ప్రతీ సినిమా మొదలుకావడానికి ముందు, మొదలైన తర్వాత కచ్చితంగా ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ కు వెళ్ళడం మహేష్ కు అలవాటు. సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలయ్యాక కొన్ని నెలలు ఫ్యామిలీతో ట్రిప్ కు వెళదామని ప్లాన్ వేసుకున్నారు కానీ అది కరోనా ప్రభావం కారణంగా కుదర్లేదు. అయితే లాక్ డౌన్, ఆ తర్వాత కూడా దాదాపు ఎనిమిది నెలలు మహేష్ తన కుటుంబంతో కలిసి ఇంటికే పరిమితమయ్యాడు. ఇక రీసెంట్ గా మహేష్, తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఫారిన్ ట్రిప్ కు వెళ్లిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మహేష్ తాజాగా చేసిన ఒక పోస్ట్ ఆసక్తికరంగా ఉంది. తన కొడుకు గౌతమ్ ను కౌగిలించుకుంటూ తాను పెద్దవాడు అవుతోన్న విషయాన్ని గుర్తుచేస్తూ ఇప్పుడు తనను హగ్ చేసుకోవడం మరింత కష్టంగా మారింది అని సరదాగా వ్యాఖ్యానించాడు. అయితే తనను హగ్ చేసుకోవడానికి తగిన కారణాలు, సమయం అవసరం లేదని అంటున్నాడు మహేష్.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.