వారి జాబితాలో ఇప్పుడు బన్ని కూడా చేరాడు

ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోన విలయతాండవం చేస్తోంది. కరోన భయం ప్రజలను వీడినప్పటికీ, దాని ప్రభావం ఇంకా పోలేదు. చాల మంది నటులు కరోన భారిన పడ్డారు. వారిలో కొందరు ఆ మహమ్మారిని ఎదిరించి జయించగా, కొంతమంది మాత్రం మన దురదృష్టవ శాత్తు ప్రాణాలు వదిలారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి మనం చేసే చిన్న తప్పిదాల వల్ల ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి. దీని నుంచి స్టార్ హీరోలు కూడా మినహాయింపు కాదు. మొన్నటి దాకా మామూలుగా ఉన్న దాని ప్రభావం ఇప్పుడు అంతకు రెండింతలు అయ్యింది. ప్రజలు కూడా మళ్ళీ భయపడేలా చేస్తోంది.

మెగా హీరోలు ఒకొక్కరూ ఈ మహమ్మారి భారిన పడుతున్నారు. మొన్న ఆ మధ్య ప్రముఖ హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్ లు కరోన భారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం కరోన భారిన పడ్డారు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వీరి జాబితాలో చేరారు. కొన్ని కోవిడ్ లక్షణాలు ఉండటంతో ముందు జాగ్రత్తగా ఆయన టెస్ట్ చేయించుకోగా ఆయనకు పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.

పాజిటివ్ రాగానే ఆయన ట్విటర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. “నాకు కరోన పాజిటివ్ అని తేలింది. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాను. నన్ను కలిసిన వారు టెస్ట్ చేయిందుకోవాల్సిందిగా కోరుతున్నాను. అభిమానులు ఎవరూ కంగారు పడకండి, బయటకి వెళ్ళకుండా తగు జాగ్రత్తలు పాటించండి” అని ట్వీట్ చేసారు. ప్రస్తుతం ఆయన పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.