ఖాళి సమయాల్లో మన హీరోలు ఏం చేస్తారో తెలుసా?

అభిమానులకి తమ అభిమాన నటులు గురించిన విషయాలు తెలుసుకోవడం ఒక సరాదా. అనుక్షణం వాళ్ళు చేసే పనుల్ని వారి సినిమాలని ఫాలో అవుతుంటారు. నిత్యం వారి గురించి ఆరా తీస్తూ ఉంటారు. అయితే వారు ఖాళి సమయాల్లో ఏం చేస్తుంటారో తెలుసుకోవాలని తెగ ప్రయత్నిస్తారు. ప్రస్తుతం మన పరిశ్రమలోని స్టార్ హీరోలు ఖాళి సమయాల్లో ఏం చేస్తారో చూద్దాం.

పవన్ కళ్యాణ్

మొదటి నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలు నెమ్మదిగానే చేసేవారు. ఏడాదికో సినిమా చేసేవారు. ఒక్కసారి రెండు ఏళ్లకు ఒక సినిమా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయనకు ఒక ఫామ్ హౌస్ ఉంది అక్కడ అన్ని రకాల కూరగాయలు, వివిధ రకాల పండ్లు సేద్యం అవుతుంటాయి. అలాగే గోశాల కూడా ఉంది. ఆయన ఖాళి సమయాల్లో అక్కడికి వెళ్ళి తనే స్వయంగా పాలు పితకడం, ఆవులకి మేత వేయడం, మొక్కలను చూసుకోవడం చేస్తుంటారు. అలాగే పుస్తకాలు బాగా చదువుతారు.

మహేష్ బాబు

మహేష్ బాబు కూడా ఏడాదికి ఒక సినిమా చేస్తారు. ఎక్కువగా తన సమయాన్ని ఫ్యామిలికి కేటాయిస్తారు. సినిమా సినిమాకి మధ్య ఉండే గ్యాప్ లలో ఫారిన్ టూర్స్ వేస్తుంటారు. అలాగే అప్పుడప్పుడూ థియేటర్ విషయాలను పరిశీలిస్తుంటారు. దాంతో పాటు వీడియో గేమ్స్ బాగా ఆడతారు.

జూనియర్ ఎన్టీఅర్

గ్యాప్ లేకుండా సినిమాలు తీసే హీరో ఎన్టీఅర్. ఆయనకు కార్లు అంటే చాలా ఇష్టం ఆయన గ్యారేజ్ లో మంచి కలెక్షన్స్ కూడా ఉన్నాయి. కెరీర్ మొదట్లో  షూట్ అయిపోయిన తర్వాత తన కార్ తనే డ్రైవ్ చేసుకుంటూ రైడ్ ని ఎంజాయ్ చేసేవారు. పొరపాటున ఎవరైనా ఆయన కార్ ఎక్కారంటే అంతే సంగతి. కాని కొన్ని అనుకోని సంఘటనలు జరిగిన తర్వాత ఆయన డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అలాగే ఆయనకు క్రికెట్ కూడా చాలా ఇష్టం. ఖాళి సమయాలో తన రూమ్ లోనే క్రికెట్ ఆడుకునేవారు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ డ్యాన్స్ చేయడం ఆయనకు ఒక హాబి. అలాగే వంటలు వండడంలో ఆయన స్పెలిస్ట్ ఎలాంటి వంటకాన్ని అయినా అద్భుతంగా వండుతారు. ఎక్కువగా తన సమయాన్ని కుటుంబంతో గడుపుతుంటారు.

ప్రభాస్

బాహుబలితో యావత్ భారత దేశాన్ని తన వైపుకి తిప్పుకున్న నటుడు ప్రభాస్. ఈ సినిమాలో ఆయన్ను చూసిన ఎవరైనా ప్రభాస్ ఏ రేంజ్ లో కసరత్తులు చేస్తాడో అనుకున్నారు. ఖాళి సమయాల్లో ప్రభాస్ ఎక్కువగా పుస్తకాలు చదువుతుంటాడు. ఆయన ఇంట్లో ఒక మినీ లైబ్రరీ ఉంది అంటే చాలా మంది నమ్మరు. పుస్తకాలు చదవడం వల్ల మనకి కొత్త విషయాలు తెలుస్తాయి అని అంటాడు మన డార్లింగ్. అలాగే వాలీబాల్, షటిల్ కూడా ఆడుతుంటాడు.

రామ్ చరణ్

సినిమాల్లోకి రాక ముందు చరణ్ పోలో గేమ్ నేర్చుకున్నాడు. చిరుత సినిమా తర్వాత కూడా ఆయన పోలో గేమ్ లో పార్టిసిపేట్ చేసాడు. ఇక ఆ తర్వాత సినిమాలనే కెరీర్ గా ఎంచుకుని బిజీ అయిపోయాడు. ఖాళి సమయాల్లో గుర్రపు స్వారి చేయడానికి ఇష్ట పడతాడు మన చరణ్. పుస్తకాలు కూడా బాగా చదువుతుంటాడు. వీక్ ఎండ్స్ కి ఫ్యామిలి మెంబర్స్ ని ఒక చోటుకి చేర్చి సరదాగా గడుపుతుంటాడు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్ మనకి కేవలం నటుడిగా, డ్యాన్సర్ గా మాత్రమె తెలుసు కాని ఆయనలో మంచి ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నాడు. వీలు చిక్కినప్పుడు కెమేరా పట్టుకుని ఫోటులు తీస్తూ ఉంటాడు. అలాగే పురాతన వస్తువులను కలక్ట్ చేయడం చాలా ఇష్టం. వీటితో పాటు బొమ్మలు వేయడం కూడా చేస్తుంటాడు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.