Latest Click of @urstrulyMahesh, @YoursGopichand, @iVishnuManchu, #NamrataShirodkar @vinimanchu at a Birthday Event pic.twitter.com/eH16aG4joQ
— BARaju (@baraju_SuperHit) January 16, 2021
సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్స్ గురించి కొత్తగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు. 40ల్లో ఉన్నా కానీ సూపర్ స్టార్ ఇంకా యూత్ ఫుల్ లుక్స్ తో మెరిసిపోతున్నాడు. బయట ఎక్కడ కనిపించినా చూపు మొత్తం తనవైపే తిప్పుకుంటున్నాడు. లాక్ డౌన్ కారణంగా దాదాపు ఆరు నెలలకు పైగా ఇంటికే పరిమితమైన మహేష్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు. రీసెంట్ గా థంబ్స్ అప్ యాడ్ షూటింగ్ లో పాల్గొన్న మహేష్, రీసెంట్ గా ఒక బర్త్ డే పార్టీలో హల్చల్ చేసాడు. అక్కడకు గోపీచంద్, మంచు విష్ణులు కూడా రావడం విశేషం. ఇలా గోపీచంద్, విష్ణు మంచు, మహేష్ బాబు కలిసి దిగిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మహేష్ కు బయటకు తెలీకపోయినా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలతో మంచి రిలేషన్ ఉంది. ముఖ్యంగా గోపీచంద్ తో స్నేహంగా ఉంటాడు మహేష్. వీరిద్దరూ కలిసి ‘నిజం’ సినిమా చేసిన విషయం తెల్సిందే. అటు విష్ణు మంచుతో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఏదేమైనా ఇలా హీరోలు కలిసున్న ఫోటోలు మంచి కిక్కిస్తాయి కదా!