మరో విచిత్రమైన సినిమాతో వస్తోన్న రామ్ గోపాల్ వర్మ

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శైలి ఎవరికీ అర్ధం కానిదిగా ఉంటుంది. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు తీయడం ఆయనకే చెల్లుతుంది. తన గురించి వస్తున్న విమర్శలు పట్టించుకోకుండా తాను తీయాలనుకున్నదే తీస్తాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా వరసగా సినిమాలు తీస్తూ వచ్చిన వర్మ ప్రస్తుతం ఫోకస్ చేసిన చిత్రం ‘లడ్కి’. పూజ బాలేకర్ అనే భామను మనకు ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నాడు. ఈ ‘లడ్కి’ చిత్రంలో పూజ బాలేకర్ బ్రూస్ లీ ఫ్యాన్ గా కనిపించనుంది. ఈమె ఒక మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్. ఇక ఈ చిత్రం నుండి ఛాలెంజింగ్ ది మేల్ అనే సాంగ్ ప్రోమోను ఈరోజు విడుదల చేసాడు. సాంగ్ ఎలాంటిదైనా వర్మ ఫోకస్ ఎప్పుడూ హీరోయిన్ల అందాల మీదే ఉంటాయన్న సంగతి తెల్సిందే. ఈ ప్రోమోలో కూడా హీరోయిన్ అందాలపై తన పూర్తి ఫోకస్ ను పెట్టాడు. ఈ పాట ఫుల్ వెర్షన్ నవంబర్ 21న ఉదయం 11 గంటలకు విడుదల కానుంది. మరి ఈ పాటలో ఇంకెన్ని విచిత్రాలు చేసాడో చూడాలి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.