రామ్ గోపాల్ వర్మ అండర్ వరల్డ్ మీద సినిమాలు తియ్యడంలో దిట్ట అని అందరికి తెలుసు. ఆయన తీసిన కంపెనీ, సర్కార్ లాంటి సినిమాలు ముంబై అండర్ వరల్డ్ గురించి ఆయనకి ఉన్న పట్టు గురించి మనకు అర్థం అయ్యేలా చేస్తాయి. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇంకొక సెన్సేషన్ తో మన ముందుకు వస్తున్నాడు. ఇండియాలో మాఫియా, అండర్ వరల్డ్ లో దావుద్ ఇబ్రహీం పేరు అందరూ వినే ఉంటారు. ఆయన జీవిత కథ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ డీ కంపెనీ పేరుతో ఒక వెబ్ సిరీస్ తీస్తున్నారు. ఈ సిరీస్ కి సంబంధించిన టీజర్ ని అర్జీవి విడుదల చేశారు. ఆర్జీవి సినిమాల్లానే ఈ వెబ్ సిరీస్ టీజర్ లో కూడా రక్తపాతం ఎక్కువగా ఉంది. బిల్ గేట్స్, అంబానీ రేంజ్ లో దావుద్ కూడా డీ కంపెనీ ని ఒక గొప్ప సంస్థగా తయారుచేయాలి అనుకున్నాడు అని ఆయన ఈ టీజర్ లో పేర్కొన్నారు. ఈ సిరీస్ ద్వారా చాలామందికి తెలియని డాన్ ల గురించి అలాగే గ్యాంగ్ స్టార్స్ గురించి ఈ సిరీస్ లో చూడబోతున్నారు అని అర్జీవి టీజర్ ద్వారా తెలిపారు. ఇక ఈ సిరీస్ ని స్పార్క్ ప్రొడక్షన్ కంపెనీ నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషలలో ఈ సిరీస్ విడుదల కాబోతుంది.