స్పోటిఫై లో పూరి జగన్నాథ్ రికార్డ్

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ అంటే మనకు గుర్తొచ్చేది డేరింగ్ ఆయన ఇంటర్వ్యూలలో కూడా దేని గురించేనా ధైర్యంగా మాట్లాడగలడు. అయితే ఇప్పుడు కరోన వలన అందరిలాగానే పూరి జగన్నాథ్ కూడా ఇంటికే పరిమితం అవ్వాల్సివచ్చింది. వరస సినిమాలు తీస్తూ బిజీగా ఉండే పూరి ఇప్పుడు లాక్డౌన్ లో కొత్తగా పోడ్ కాస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఇక ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న పోడ్ కాస్ట్ ఆడియోలతో ఈ డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ డైరెక్టర్‌ సంచలనం సృష్టిస్తున్నారు. సమాజంలోని ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ తనదైన స్టైల్‌లో వివరణ ఇస్తున్నారు. అందుకే ఆయ‌న మాట్లాడుతుంటే ఆవేశంతో కూడిన వేదాంతం వినిపిస్తూ ఉంటుంది. అలాగే టాపిక్ ఏదైనా క్లియ‌ర్ క‌ట్‌గా మాట్లాడ‌తాడు. ఆయ‌న అన్ని పోడ్ కాస్ట్ లలో జీవితానికి ఉపయోగప‌డే అంశంలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణాల వల్లే పూరి ఆడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ ఈ పోడ్ కాస్ట్ లతో స్పోటిఫై మ్యూజిక్ అప్ లో  కొత్త రికార్డ్ సృష్టించాడు. అది ఏంటి అంటే 2020 సంవత్సరంలో టాప్ పోడ్ కాస్ట్ లిస్ట్ లో మన పూరి పోడ్ కాస్ట్ ఒకటిగా నిలిచింది. దాదాపు 60 వేల మంది పూరి జగన్నాథ్ పోడ్ కాస్ట్ లని విన్నారు అని స్పోటిఫై విడుదల చేసిన లిస్ట్ లో పేర్కొన్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.