బాలివుడ్ లో విజయ బావుటా ఎగుర వేసిన కె. బాపయ్య

ప్రముఖ తెలుగు హిందీ చిత్రాల దిగ్గజ దర్శకుడు. ఆయన దాదాపు 80సినిమాలు తెరకెక్కించారు. భారతీయ సినిమా తొలితరం దర్శకులైన “కె.ఎస్ ప్రకాశరావు గారి కుమారుడు. ఆయన తీసిన ‘ప్రేమ్ నగర్’ సినిమాకు దర్శకత్వ విభాగంలో పనిచేసి అందులో మెళకువలు నేర్చుకున్నారు. ప్రముఖ నటులు జగ్గయ్య, వాణిశ్రీ, కృష్ణంరాజు, ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన “ద్రోహి” చిత్రంతో దర్శకుడిగా వెండి తెరకు పరిచయమయ్యారు.

ఆ తర్వాత వరసగా ‘మేము మనుషులమే’, ‘ఎదురులేని మనిషి’, ‘ఊర్వశి’, ‘సోగ్గాడు’, చిత్రాలను ఆయన తెరకెక్కించారు. 1977 “దిల్ దార్” చిత్రంతో ఆయన బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. తెలుగులో ఆయన దర్శకత్వంలోనే వచ్చిన సోగ్గాడు చిత్రానికి ‘దిల్ దార్’ రీమేక్. ఆ చిత్ర విజయం, ఆయన్ను బాలీవుడ్ లో నిలబడేలా చేసింది. తెలుగులో సినిమాలు చేస్తూ కూడా ఆయన బాలీవుడ్ సినిమాలు చేశారు. దిల్ దార్ చిత్రం తర్వాత ఆయన వరసగా బాలివుడ్ లో సినిమాలు చేశారు. దిల్ ఔర్ దీవార్, టక్కర్, బందిష్, సింధూర్ బనే జ్వాలా, మవాలి, మక్సద్, లాంటి చిత్రాలు ఎన్నో ఆయన హిందీలో తెరకెక్కించారు. వాటిల్లో కొన్ని తెలుగు రీమేక్ చిత్రాలు ఉన్నాయి. 1977లో మొదలు పెట్టి 3దశాబ్దాల పాటు ఆయన బాలివుడ్ లో సినిమాలు చేసారు. కమర్షియల్ ఫార్ములాతో విజయాల బాట పట్టి బాలివుడ్ లోని అనేక మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసి అక్కడ విజయ బావుటా ఎగురవేశారు బాపయ్య.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.