త్వరలో థియేటర్స్ లోకి రాబోతున్న ‘బోగన్’

తమిళ నటులు జయం రవి, అరవింద స్వామి ఈ కాంబినేషన్‌ అనగానే మనకు గుర్తొచ్చే  చిత్రం ‘తని ఒరువన్‌’. ఈ సినిమాలో అరవింద్ స్వామి నటనకి చాలా మంచి పేరు వచ్చింది. విలన్ గా అరవింద స్వామి , హీరోగా జయం రవి ఇద్దరు పోటీ పడి నటించారు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లొనే 2017లో వచ్చిన బోగన్ సినిమా కూడా మంచి హిట్ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాని తెలుగులోకి అదే పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో జయం రవికి జోడి గా హన్సిక నటించింది. బోగన్ సినిమాని లక్ష్మణ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాని త్వరలోనే థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లు ఈ మూవీ టీమ్ ఒక పోస్టర్ ని సోషల్ మీడియాలో విడుదల చేసింది. బోగన్ సినిమాని తెలుగులోకి  ఎస్‌.ఆర్‌.టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ డబ్బింగ్ చేస్తున్నారు. ఈమద్యనే సినిమా ట్రైలర్  కూడా  విడుదల చేశారు. తమిళంలో లాగానే తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి, కానీ బోగన్ తెలుగు ట్రైలర్ మాత్రం చూడటానికి కొత్త కాన్సెప్ట్ లాగానే కనిపిస్తుంది. ఈ సినిమాని సాయి రిషిక సమర్పణలో రజనీ తాళ్లూరి నిర్మించారు. డి.ఇమాన్‌ స్వరాలు అందించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.