చార్మి పెట్ తో డార్లింగ్ రెబల్ స్మైల్

డార్లింగ్ ప్రభాస్ కొత్త ఫోటో  సోషల్ మీడియా లో వైరల్. సెలెబ్రేటీలు పెట్స్ ని పెంచుకోవడం సహజమే. సెలెబ్రెటీస్ యే కాదు చాలా మంది పెట్స్ అంటే ప్రాణమిస్తారు. ముఖ్యంగా హిరో హిరోయిన్స్ తమ పెట్స్ తో షూటింగ్ లేని సమయాల్లో వాటితోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు. వాటితో దిగిన సెల్ఫీలు, బెస్ట్ మూమెంట్స్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ పోస్టు లు పెడుతుంటారు. తాజాగా డార్లింగ్ ప్రభాస్ డాగ్ తో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రభాస్ ఈ ఫోటోలో బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో స్మైల్ ఇస్తూ, గర్జిస్తున్న సింహాం లా ఉన్న పెట్ అలస్కన్ మలమ్యూట్ బ్రీడ్ కి చెందిన డాగ్ తో ఫోజ్ ఇచ్చాడు. ఈ ఫోటో ప్రభాస్ అభిమానులతో పాటు చాలా మంది ఇంటర్ నెట్ ప్రియులకు నచ్చెసింది. డార్లింగ్ ప్రభాస్ తో తొమ్మిది నెలల బేబీ బాయ్ అంటూ సంబరంతో ఈ ఫోటో ను షేర్ చేస్తూ చార్మీ కౌర్ తన ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది.  ఆ అలస్కన్ మలమ్యూట్ డాగ్ పంజాబీ బ్యూటీ చార్మీ పెట్. ఈ ఫోటో తీసింది డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అండ్ చార్మీ కౌర్ ఆఫీస్ పూరి కనెక్ట్స్ లో తీసారు. పూరి జగన్నాథ్ కి, చార్మికి పెట్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే. చార్మీ ఈ పోస్ట్ పెట్టిన నిమిషాల్లోనే అభిమానులు, స్నేహితులు కామెంట్ల, లైకుల వర్షం కురిపించారు. ఏది ఏమైనా డార్లింగ్ ప్రభాస్ గర్జిస్తున్నట్టు ఉన్న డాగ్ పక్కన ప్రభాస్ రెబల్ ఫోజ్ లో స్మైల్ ఇస్తూ అభిమానుల గుండెల్ని కొల్లగొట్టాడు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.