Bring It On! Beat is On!
— BARaju (@baraju_SuperHit) December 25, 2020
Are you a college student?
Then, we invite you in to the sets of @sreevishnuoffl @Actor_Amritha's @MatineeEnt Production-9 on this Dec 26 & 27, 8 AM.
Directed by @DirTejaMarni
Produced by #NiranjanReddy #AnveshReddy
Place: GOVT College, #Rajahmundry pic.twitter.com/pw5ymp6uQC
శ్రీ విష్ణు హీరోగా, ‘జోహార్’ ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 9 మూవీని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అనౌన్స్ చేసింది. వైవిధ్యమైన సబ్జెక్టులను ఎంచుకుంటూ వస్తున్న శ్రీవిష్ణు, తొలి సినిమా జోహార్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న తేజ మార్ని, కంటెంట్ రిచ్ ఫిలిమ్స్ కు పేరుపొందిన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ తొలి కలయికలో ఈ సినిమా రూపొందుతుంది. నీది నాది ఒకే కథ, బ్రోచెవారెవరురా సినిమాల హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు హిరో శ్రీ విష్ణు. క్షణం, ఘాజి, గగనం లాంటి చక్కని కంటెంట్ ఉన్న కమర్షియల్ హిట్ సినిమాల్ని నిర్మించిన ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 'ఆచార్య', కింగ్ నాగార్జున్ హీరోగా 'వైల్డ్ డాగ్' లాంటి క్రేజీ ఫిలిమ్స్ ను నిర్మిస్తోంది. ఈ సినిమాతో పాటు శ్రీ విష్ణు సినిమా కూడా నిర్మిస్తోంది. ఈ సినిమాలో శ్రీ విష్ణుకి జోడిగా అమృత అయ్యర్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. అయితే తాజాగా ఈ టీమ్ కొత్త అనౌన్స్మెంట్ చేశారు. కాలేజీ స్టూడెంట్ అయితే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనవచ్చు. ఈ సినిమా రాజమండ్రిలోని గవర్నమెంట్ కాలేజీ లో షూటింగ్ జరుపుకుంటంది. ఈ సినిమా టీమ్ చేసిన ఈ అనౌన్స్మెంట్ ను బి.ఎ రాజు తన ట్విట్టర్ ద్వారా పంచకున్నాడు. ఈ చిత్రానికి ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ సంగీతం సమకూరుస్తుండగా, జగదీష్ చీకటి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు