త్రివిక్రమ్ కు తన అవార్డును డెడికేట్ చేసిన ఎస్.ఎస్ థమన్

టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరక్టర్ గా దూసుకుపోతున్నాడు ఎస్ ఎస్ థమన్. వరసగా సూపర్ హిట్ ఆల్బమ్స్ తో టాప్ ప్లేస్ లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. గతేడాది థమన్ సంగీతం అందించిన అల వైకుంఠపురములో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక జాతీయ స్థాయిలో, అంతకు మించి అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రంలోని సాంగ్స్ గుర్తింపు తెచ్చుకున్నాయి. థమన్ కు రీసెంట్ గా అరుదైన గౌరవం లభించిన విషయం తెల్సిందే. ఎస్ ఎస్ థమన్ కు దాదా సాహెబ్ ఫాల్కే సౌత్ 2020కు గాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డు వరించింది. అల వైకుంఠపురములో చిత్రానికి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చినందుకు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు థమన్. దీంతో తన అవార్డు పట్ల థమన్ సంతోషం వ్యక్తం చేసాడు. అలాగే ఈ పురస్కారాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ కు డెడికేట్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆయన సహకారం లేనిదే ఈ రేంజ్ లో ఔట్పుట్ వచ్చేది కాదని థమన్ అన్నాడు. అలాగే అల్లు అర్జున్ కు, అల వైకుంఠపురములో టీమ్ కు తన థాంక్స్ ను తెలియజేసాడు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.