
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నారప్ప అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ సినిమాకి ఈ సినిమా రీమేక్ కాగా కొత్త బంగారు లోకం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకుడు.. బ్రహ్మోత్సవం సినిమా పరాజయం తర్వాత ఏ సినిమాని ఒప్పుకోలేదు శ్రీకాంత్.. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. ప్రియమణి ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది..

కాగా ఈ సినిమాకి సంబందించిన ఓ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి స్వర బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. చాల గ్యాప్ తర్వాత మళ్ళీ సంగీతం అందిస్తుండగా ఈ మ్యూజిక్ పై మంచి అంచనాలు ఉన్నాయి.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్పెషలిస్ట్ అయిన మణిశర్మని నారప్ప టీం అవమానించింది అని ఆయన ఫీలవుతున్నారు. నారప్ప సినిమా మ్యూజిక్ విషయంలో నారప్ప టీం మణిశర్మ పేరు వేస్తూ.. తమిళ అసురన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ని యాజిటీజ్ గా వాడెయ్యడంతో.. అందరూ మణిశర్మ అసురన్ ట్యూన్స్ ని కాపీ కొట్టి నారప్పకి ఇచ్చాడని మణిశర్మ ని కామెంట్ చెయ్యడంతో.. బాగా హార్ట్అయ్యారు మణిశర్మ..

ఈ విషయాన్నీ ఓ ఇంటర్వ్యూ లో నారప్పకి తాను మ్యూజిక్ ఇవ్వలేదని అసురన్ ఒరిజినల్ ట్యూన్స్ నే వాడేసారని తాను ఇచ్చిన మ్యూజిక్ ని పక్కనబెట్టేశారని వివరణ ఇచ్చారు. అయినా ఆ విషయంలో మణిశర్మ బాగా హార్ట్ అయ్యారు. అప్పటి నుండి నారప్ప విషయంలో మణిశర్మ అంటీముట్టనట్టుగా ఉండడమే కాదు.. రీసెంట్ గా నా పేరు నారప్ప టైటిల్ లో వెయ్యొద్దు నేను ఈ ప్రాజెక్ట్ నుండి అధికారికంగా తప్పుకుంటున్నాను అని చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.