ఒక దగ్గర హిట్.. మరో దగ్గర ఫట్. తేడా ఏంటి..?

ఈ మధ్యకాలంలో ఓ.టి.టిలకు డిమాండ్ బాగా పెరిగిపోతోంది. కరోన కారణంగా లాక్డౌన్ విధించడంతో జనాలు చాలా వరకు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇక వారికి కాలక్షేపంగా ఓ.టి.టిలు ఉంటున్నాయి. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు కూడా మళ్ళీ ఓ.టి.టిలలో విడుదల చేస్తున్నారు దీంతో ఆ సినిమాని థియేటర్లో చూడని ప్రేక్షకులు ఓ.టి.టి లలో చూస్తున్నారు. ఒకరకంగా ఇది నిర్మాతలకు కూడా ప్లస్ పాయింటే ఎందుకంటే ఒక వేళ థియేటర్లలో వారి సినిమా ఆడకపోయినా ఓ.టి.టి ద్వారా కూడా ఎంతోకొంత పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది.

ఈ కోవలోనే చాలా సినిమాలు థియేట్రికల్ గా రిలీజ్ అయ్యి మళ్ళీ ఓ.టి.టిల్లో రిలీజ్ అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు హిట్ అయినవి ఉంటె మరికొన్ని ఫ్లాప్ సినిమాలు. ఇక సంక్రాంతికి విడుదలైన మాస్టర్, క్రాక్, రెడ్ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అలాగే అవి ఓ.టి.టి ఫ్లాట్ఫార్మ్స్ లో కూడా మంచి టి.ఆర్.పి రేటింగును తెచ్చుకున్నాయి. ఇక ఆ తర్వాత విడుదలైన ఉప్పెన, జాతిరత్నాలు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ రెండు చిత్రాలు అనుకోని విధంగా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. కాని ఓ.టి.టిలలో మాత్రం ప్రేక్షకాదరణను పొందలేకపోయాయి.

నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన వైల్డ్ డాగ్ చిత్రం థియేటర్లలో అంతగా ఆడలేదు. కాని ఓ.టి.టిలో విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ ని సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక అదే కోవలో విడుదలైన మరో చిన్న చిత్రం ‘లవ్ లైఫ్ అండ్ పకోడీ’. బిమల్ కార్తిక్, సంచిత ప్రధాన పాత్రల్లో నటించిగా జయంత్ గాలి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడింది. ఆల్మోస్ట్ తెలుగులో ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్ తో దర్శకుడు మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఓ.టి.టిలో మంచి టి.ఆర్.పి తో దూసుకుపోతోంది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.