నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న సినిమాలు

లాక్డౌన్ కారణంగా సినిమాలతో పాటు ఉత్తమ చిత్రాలను ప్రోత్సాహించేందుకు ఇచ్చే జాతీయ అవార్డ్లు ఇవ్వడంలో కూడా జాప్యం జరిగింది. అయితే ఇన్ని రోజులకి 67వ జాతీయ అవార్డ్లను జ్యూరీ ప్రకటించింది. 2019లో సెన్సార్ జరుపుకున్న చిత్రాలను పరిగణలోకి తీసుకుంటూ అవార్డ్లను ప్రకటించడం జరిగింది. అవార్డ్ పక్కా అనుకున్న సినిమాకి అవార్డ్ రాకపోవడం సహజమే. అంచనాలను అందుకుంటూ కొన్ని చిత్రాలు అవార్డ్లను అందుకున్నాయి. ఎలాంటి అంచనాలు లేని చిత్రాలకు కూడా అవార్డ్లు వచ్చాయి. ఈ సారి తెలుగు నుండి రెండు చిత్రాలు నేషనల్ అవార్డులను గెలుచుకున్నాయి.

గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా రెండు విభాగాల్లో, మహర్షి సినిమా రెండు విభాగాల్లో అవార్డులను గెలుచుకున్నాయి. నేషనల్ వైడ్ గా ఎడిటింగ్ విభాగంలో జెర్సీ సినిమా అవార్డు కైవసం చేసుకుంది దాంతో పాటే ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కూడా తెలుగు భాషలో జెర్సీ అవార్డు లభించింది. ఇక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహర్షి కూడా రెండు విభాగాల్లో జాతీయ అవార్డ్ లను గెలుచుకుంది. కొరియోగ్రఫీ విభాగంలో ఒక అవార్డు, ప్రసిద్ధ వినోదాత్మక విభాగంలో ఈ చిత్రానికి అవార్డులను కైవసం చేసుకుంది.

ఉత్తమ చిత్రం

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, సహజ నటి సుహాసిని ప్రాధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మరక్కర్’. ప్రియదర్శన్ దర్శకుడు. ఇక్కడ గమనించ దగ్గ విషయం ఏంటంటే అసలు ఈ చిత్రం విడుదలె కాలేదు. అయితే 2019లోనే సెన్సార్ పూర్తయ్యింది కాబట్టి ఈ చిత్రానికి అవార్డు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకి అవార్డు మరింత బలం చేకూర్చింది.

ఉత్తమ నటుడు

ఉత్తమ నటుడి కేటగిరీలో ఇద్దరు నటులు ఎంపికయ్యారు. భోంస్లే చిత్రానికి గాను బాలివుడ్ నటుడు మనోజ్ బాజ్పేయ్ కి అసురన్ చిత్రానికి గాను తమిళ నటుడు ధనుష్ కి ఈ అవార్డ్ ప్రకటించడం జరిగింది.

ఉత్తమ నటి

ఉత్తమ నటిగా కంగనా రనౌత్ ఎంపికయింది. మణికర్ణిక, పంగా చిత్రాల్లోని ఆమె నటనకు ఆమెకు ఈ అవార్డ్ ఇవ్వడం జరిగింది.

ఉత్తమ సహాయ నటుడు

సూపర్ డీలక్స్ చిత్రంలోని నటనకు గాను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ అవార్ద్ కి ఎంపికయ్యారు. ఈ చిత్రానికి ఉత్తమ చిత్ర పురస్కారం వస్తుందని అనుకున్నారు కాని విజయ్ గారికి వచ్చింది.

ఉత్తమ స్క్రీన్ ప్లే

ఈ విభాగంలో బెస్ట్ ఒరిజినల్ కి గాను జ్యేష్తోపుత్రో చిత్రానికి స్క్రీన్ ప్లే రాసిన కౌశిక్ గంగూలి కి అవార్డ్ లభించగా, అడాప్తేడ్ విభాగంలో గుమ్నామి చిత్రానికి స్క్రీన్ ప్లే రాసిన శ్రీజిత్ ముఖర్జీకి అవార్డ్ వచ్చింది. ఇక ఉత్తమ డైలాగ్స్ విభాగంలో వివేక్ అగ్నిహోత్రికి అవార్డ్ వచ్చింది.

ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు

గౌతం తిన్నూరి దర్శకత్వంలో నాని నటించిన జెర్సీ సినిమాకి ఉత్తమ తెలుగు చిత్రం అవార్డ్ లభించింది. ఎడిటింగ్ విభాగంలో ఉత్తమ చిత్రంగా జెర్సీ చిత్రం ఎంపికయ్యింది.

సుశాంత్ సింగ్, నవీన్ పొలిశెట్టి, శ్రద్ధా కపూర్ నటించిన చిచోరే చిత్రానికి ఉత్తమ హిందీ చిత్రంగా అవార్డ్ వచ్చింది.

ధనుష్ నటించిన అసురన్ సినిమా ఉత్తమ తమిళ చిత్రంగా ఎంపికయ్యింది.

ఉత్తమ యాక్షన్ విభాగంలో కన్నడ చిత్రం అవనే శ్రీమన్నారాయణకి అవార్డు వచ్చింది.

సినిమాటోగ్రఫీ విభాగంలో ఉత్తమ చిత్రంగా జల్లికట్టు సినిమా ఎంపికయ్యింది.

మహర్షి చిత్రానికి కొరియోగ్రఫీ విభాగంలో, ప్రసిద్ధ వినోదాత్మక చిత్రంగా రెండు అవార్డులు లభించింది.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.