తెలుగులో 2018లో వచ్చిన ‘అ!’ సినిమాతో జాతీయ అవార్డ్ గెలుచుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఆ సినిమా తర్వాత ప్రముఖ నటుడు రాజశేఖర్ హీరో గా ‘కల్కి’ సినిమా తీసి అందర్నీ మెప్పించాడు. ప్రతీ సినిమాలో కొత్తదనాన్ని పరిచయం చేసే ప్రశాంత్ వర్మ ఇప్పుడు ‘జాంబీ రెడ్డి’ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ బైట్ టీజర్ నటి సమంత విడుదల చేసారు. దైవం మనిషి రూపేణా అనే డైలాగ్ తో మొదలయ్యే ఈ టీజర్ చూడటానికి చాలా ఆసక్తిగా ఉంది. అలాగే టీజర్ లో విజువల్స్ ఇంకా బాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. కరోన వలన మనుషులు అంత జాంబీలుగా మారిపోతే ఏమవుతుంది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతుంది. ఈ టీజర్ జాంబీ రెడ్డి సినిమా మీద అంచనాలని పెంచేసింది. తెలుగులో మొదటిసారిగా జాంబీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ జాంబీ రెడ్డి సినిమాలో బాలనటునిగా ఇంద్ర, బాలు లాంటి సినిమాల్లో అలరించడంతో పాటుగా ‘ఓ బేబీ’ చిత్రంలో కీలక పాత్రలో ఆకట్టుకున్న తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తియింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని త్వరలోనే సినిమాని థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు.