
‘అ!’ చిత్రంతో అరంగేట్రం చేసి తోలి చిత్రంతోనే తన మార్క్ చూపించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత సీనియర్ నటుడు రాజశేఖర్ గారితో ఆయన తెరకెక్కించిన ‘కల్కి’ చిత్రం ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోయినా మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. బాల నటుడిగా తేజ సజ్జ, ఆనంది, దక్ష నాగర్కర్ లు ప్రధాన పాత్రల్లో ఆయన తెరకెక్కించిన ‘జాంబీ రెడ్డి’ చిత్రం ఫిబ్రవరి 5న విడుదలైంది. రాయలసీమ బ్యాగ్రౌండ్ లో జాంబీల మీద వచ్చిన ఈ చిత్రం తెలుగులో మొదటి జాంబీ చిత్రం. విడుదలైన అన్ని సెంటర్లలో మంచి టాక్ తెచ్చుకుంటోంది. స్నేహితుడి పెళ్ళికి వెళ్ళిన హీరో గ్రూప్ కి అక్కడ ఒక పరిస్థితి ఎదురవుతుంది. ఒక అమ్మాయిని జాంబీ కొరకడం, ఆ అమ్మాయి ఇంకొకరిని కొరకడం ఇలా ఊరు మొత్తం పాకిపోతుంది. అలాంటి పరిస్థితి నుంచి వారు ఎలా బయట పడ్డారు అనేది చిత్ర కథ. విజువల్స్ చాల బాగున్నాయి, ప్రొడక్షన్ వర్క్ చాల బాగా చేసారు, బి.జి.ఎమ్ కూడా చాలా బాగుంది. కథ ఎక్కువగా ఫ్యాక్షన్ మీద వెళ్ళడం కొద్దిగా బోర్ అనిపిస్తుంది. కాని లాజిక్ మిస్ అవ్వకుండా తీసినందుకు ప్రశాంత్ వర్మను అభినందించాలి. మీరు కూడా ఒకసారి జాంబీ రెడ్డిని కలిసి రండి.