కమెడియన్లు హీరోలుగా మారడం అనేది సర్వసాధారణ విషయమే. రీసెంట్ గా షకలక శంకర్, సప్తగిరి వంటి కమెడియన్స్ హీరోలుగా మారి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు కూడా. ఇక ఇప్పుడు మరో కమెడియన్ సత్య వంతు వచ్చింది. సత్య లీడ్ రోల్ లో వివాహ భోజనంబు చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా టీజర్ ను ఈరోజు విడుదల చేసారు. సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెల్సిందే. రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా వైవా హర్ష, సుదర్శన్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందినట్లు అర్ధమవుతోంది. కామిక్ వే లో వివాహ భోజనంబు చిత్రాన్ని మలిచారు మూవీ యూనిట్. కరోనా కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించగా ఆ సమయంలో పెళ్ళి చేసుకున్న మన హీరో కష్టాలు ఈ సినిమాలో చూపించినట్లు అర్ధమవుతోంది. లాక్ డౌన్ కారణంగా పెళ్ళికి వచ్చిన వారు అందరూ తన ఇంట్లోనే ఉండడంతో ఎటువంటి ఇబ్బందులు పడ్డారు అనేడి చిత్ర మెయిన్ పాయింట్.