ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నాగ శౌర్య. యూత్ ఫుల్ ఎంటర్టైమెంట్ సినిమాలని చేస్తూ నాగ శౌర్య దూసుకొని వెళ్తున్నాడు. ప్రస్తుతం సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ శౌర్య , రీతువర్మ కలిసి నటిస్తున్న చిత్రం 'వరుడు కావలెను' . ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం కానుంది.ఇప్పటికే ఈ సినిమాకి సంభందించి ఓ ఆకట్టుకునే అందమైన వీడియో ను కూడా విడుదల చేశారు. ఈ వీడియో లో నాగశౌర్య, రీతువర్మ ఎంతో బాగా కనిపించారు. ఇక ఇప్పుడు 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ మూవీ టీం ఈ సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో నాగ శౌర్య , రీతూ వర్మ కాఫి షాప్ లో కూర్చొని నవ్వుతూ కనిపించారు. ఇక ఈ సినిమాలో నాగశౌర్య, రీతువర్మతో పాటు నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష వంటి వారు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాని త్వరలోనే థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు మూవీ టీం. తెలుగులో ఇలాంటి కూల్ సినిమాలకి చాలా క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ ని వరుడు కావాలనే సినిమా ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందో చూడాలి.